మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఇటీవల సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివల మీద తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సుబ్బారావు అనే అడ్వకేట్ ఈ ఇద్దరి మీద కేసులు పెట్టగా.. తనకు ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేదంటూ మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చింది.
మరోవైపు ఈ వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా తెరపైకి రాగా.. ఆయన సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం చేయడం తప్ప ఇందులో ఆయన తప్పేమీ లేదని తర్వాత స్పష్టత వచ్చింది. ఐతే ఈ కేసులో బాధితులు మీడియా ముందుకు వచ్చి.. మంగ్లీతో పాటు ఆమె సోదరుడి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరికీ ఇంకా క్లీన్ చీట్ ఏమీ రాలేదు. గత కొన్ని రోజులుగా పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో మంగ్లీ సోదరుడు శివ ప్రమేయంపై పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు శివ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. దానికి రామావత్ మధు అకౌంట్ నుండి మూడు సార్లు డబ్బులు జమ అయినట్లు.. మరుసటి రోజే ఆ డబ్బులన్నీ విత్‌డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. మధు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు.. శివతో పాటు మరి కొందరి ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ పంపారు.
మంగ్లీ సోదరుడి ఖాతాలోకి మైక్రోఫైనాన్స్ డబ్బులు జమ కావడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మంగ్లీ మెడకు కూడా ఈ కేసు చుట్టుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్న మంగ్లీ.. తన సోదరుడి ప్రమేయం గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
మంగ్లీకి పేరు చెప్పి, ఆమెకు ఉన్న ఫేమ్‌ను ఉపయోగించుకునే ఆమె సోదరుడు జనాల దృష్టిని ఆకర్షించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది రూ. కోట్లలో మోసగించారంటూ న్యాయవాది సుబ్బారావు బాధితుల తరఫున కేసులు పెట్టడం..ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ మీద ఆరోపణలు చేయడంతో మీడియాలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on April 30, 2026 9:08 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…