Movie News

సింహం క్లిక్ అయితే శ్రీవిష్ణుకీ ప్రయోజనం

రేపు విడుదల కాబోతున్న గాయపడ్డ సింహంలో స్పెషల్ క్యామియో చేసిన శ్రీవిష్ణుని దాచి పెట్టుకుని ట్రంప్ కార్డులా వాడకుండా ముందే రివీల్ చేసి టీమ్ తెలివైన పని చేసింది. ఎందుకంటే ఈ అంశాన్ని దాచి పెట్టి ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ముందైతే మొదటి రోజు జనం నిండుగా రావాలి. తరుణ్ భాస్కర్ కి ఎలాంటి ఇమేజ్ లేని నేపథ్యంలో క్రౌడ్ ని ఫుల్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ కమర్షియల్ ఎలిమెంట్ అవసరం. దాన్ని శ్రీవిష్ణు రూపంలో వాడుకున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే శ్రీవిష్ణుకి కూడా ఇలాంటి సింహం అవసరం ఉంది. ఎందుకంటే తన గత రెండు సినిమాలు విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. అలాని కొత్త సినిమాలు చేయడంలో నెమ్మదించలేదు కానీ బలమైన హిట్టు ఒకటి పడితే మార్కెట్ పరంగా ప్లస్ అవుతుంది. స్పెషల్ ప్రీమియర్ టాక్ ప్రకారం గాయపడ్డ సింహంలో చేతబడి చేసే వెరైటీ క్యారెక్టర్ లో శ్రీవిష్ణు డిఫరెంట్ గా ఉన్నాడట. క్లిక్ అయితే చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు.

ట్విస్ట్ ఏంటంటే గాయపడ్డ సింహంకి రెండో భాగం పోరాట సింహంలో హీరో శ్రీవిష్ణునే. ఇది కూడా పెద్ద సస్పెన్స్ ఏమి కాదు. ఆల్రెడీ మూడు సినిమాల లైనప్ తో బిజీగా ఉన్న తనకు ఈ కంటెంట్ మీద నమ్మకంతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో జెడి చక్రవర్తి మరో అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. విసుగు చెందకుండా అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ వైరల్ కంటెంట్ కు దోహదపడ్డారు

మరో కామెడీ మూవీ జెట్లీతో పోటీ పడుతున్న గాయపడ్డ సింహంకు మంచి రిలీజ్ దక్కుతోంది. కాంపిటీషన్ తక్కువగా ఉండటం వల్ల అవసరమైనన్నీ స్క్రీన్లు దొరుకుతున్నాయి. డబ్బింగ్ సినిమాల బజ్ సున్నా ఉండటంతో అది సత్య, తరుణ్ భాస్కర్ లకు ప్లస్ కానుంది. సామజవరగమనలో చిన్న గెస్టు రోల్ తో దాని హిట్ లో భాగం పంచుకున్న శ్రీవిష్ణు ఇప్పుడీ గాయపడ్డ సింహం కనక సక్సెస్ అయితే ఎంత శాతం క్రెడిట్ దక్కించుకుంటాడనేది వేచి చూడాలి.

This post was last modified on April 30, 2026 7:20 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

15 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago