Trends

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవే ప్రజల మన్నలను పొందుతాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది.

గడ్డివాములు తగలబెట్టిన ఘటనలతో రైతుల్లో భయాందోళనలు రేపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దవడుగూరు మండలం పరిధిలో గత రెండు వారాలుగా వరుసగా జరిగిన అగ్నిప్రమాదాల వెనుక ఒకే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం, నాగసముద్రం గ్రామానికి చెందిన టపిల పెద్ద పాండురంగడు అలియాస్ సుధాకర్‌ను ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతడిని గుర్తించి, అక్షయ కాలనీ సమీపంలో పట్టుకున్నారు.

గత ఏప్రిల్ 12 రాత్రి వెల్పుల గంగరాజు, అదే రాత్రి జెడ్. వీరారెడ్డి గడ్డివాములు తగలబెట్టగా, ఏప్రిల్ 19న వట్టం రామేశ్వరరెడ్డి గడ్డివాములకు కూడా నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జొన్న దుప్పలు, కొర్ర, సామ వాములు దగ్ధమవడంతో సుమారు ₹7 లక్షల నష్టం వాటిల్లింది.

విచారణలో భాగంగా, తగాదాలు ఉన్న వారిపై కక్షతో గడ్డివాములు తగలబెట్టే అలవాటు ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం తన స్వగ్రామంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపినట్టు పేర్కొన్నారు.

అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఎస్‌ఐ పబ్లిక్‌లో చితకబాదిన ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పీ విచారణకు ఆదేశించారు. చట్టపరమైన చర్యలే తీసుకోవాల్సిన సమయంలో ‘పోలీసు మార్క్ ట్రీట్మెంట్’ సరైనదా అనే చర్చ కొనసాగుతోంది.

This post was last modified on April 22, 2026 11:05 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago