Movie News

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో యాక్షన్ డ్రామాని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య నెక్స్ట్ లిస్టులో వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల ఉన్నారు. కాకపోతే ఎవరిది ఫస్ట్ ఎవరిది తర్వాతనే క్లారిటీ ఇంకా రావడం లేదు. ఈలోగా కొరటాల పేరు తెరమీదకొచ్చింది.

ఇది కన్ఫర్మ్ అంటున్నారు సరే కానీ కొరటాలకు బాలయ్య మూవీ ఒకరకంగా సవాల్ లాంటిదే. ఎందుకంటే పదమూడేళ్ల కెరీర్లో కొరటాల డీల్ చేసిన హీరోలు ఇప్పటి జనరేషన్ వాళ్ళు. మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తో మంచి కెమిస్ట్రీ కుదిరి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. కానీ చిరంజీవికి తగ్గ కథను రాసుకోవడంలో, హ్యాండిల్ చేయడంలో దారుణంగా తడబడ్డారు. ఫలితంగా మెగాస్టార్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఆచార్య నిలబడిపోయింది.

సో సీనియారిటీని ఎలా ప్రెజెంట్ చేయాలనే దాని మీద కొరటాల బాగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దేవర సక్సెస్ అయినా సెకండాఫ్ మీద ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. దాని వల్ల సీక్వెల్ మీద ఆశించినంత పెద్ద స్థాయిలో హైప్ రాలేదని జూనియర్ అభిమానులు ఫీలవుతూ ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి శీను లాగా కొరటాల శివ ఆలోచించక తప్పదు.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు. నందమూరి అబ్బాయిని డైరెక్ట్ చేశాక బాబాయ్ ఛాన్స్ రావడం కొరటాల లక్ అని చెప్పొచ్చు. గతంలో వివి వినాయక్ ఈ అవకాశం దక్కించుకున్నారు. ఆది చూశాక చెన్నకేశవరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలకృష్ణ. ఇప్పుడు దేవర తర్వాత కొరటాలకు ఆ కలయిక కుదరడం విశేషం. అన్నట్టు దేవర 2 సంగతి వచ్చే నెల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారో లేదో చూడాలి.

This post was last modified on April 22, 2026 8:11 am

Share

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

28 minutes ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

1 hour ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

2 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

2 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

13 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago