Trends

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో పడేది ఆరోజే. దక్షిణ ఆసియాలోని అన్ని దేశాల్లో దాదాపు ఇదే విధానం అమలవుతోంది. అయితే కొంచెం వినూత్నంగా ఆలోచించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో కీలక మార్పు చేపట్టినట్లు సమాచారం..

ఇప్పటివరకు అమలులో ఉన్న నెలవారీ జీతాల విధానాన్ని రద్దు చేస్తూ, ప్రతి 15 రోజులకు ఒకసారి జీతం చెల్లించే ‘ఫోర్ట్‌నైట్‌లీ పే సిస్టమ్’ను ఏప్రిల్‌ 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. దక్షిణాసియాలో ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా నేపాల్ నిలిచింది.

ఈ విధానం ప్రకారం ఉద్యోగుల నెల జీతాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి, ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉద్యోగుల చేతిలో డబ్బు నిరంతరం ఉండేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ కొత్త విధానం సివిల్ సర్వెంట్లు, నేపాల్ సైన్యం, పోలీసు బలగాలకు వర్తిస్తోంది. తరువాతి దశలో ఇతర ప్రభుత్వ రంగాలకు విస్తరించే అవకాశముంది.

ఉద్యోగుల ఆర్థిక అవసరాలు సకాలంలో తీర్చడం, మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ఉద్యోగులకు నెలలోనే రెండు సార్లు ఆదాయం అందించేలా చేయడంతో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు తోడ్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on April 21, 2026 8:52 pm

Share

Recent Posts

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

2 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

3 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

3 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

6 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

6 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

7 hours ago