అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. అయితే, తాజాగా తిరుమల శ్రీవారి భక్తులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దేవస్థానం అధికారులు, అదేవిధంగా పాలకమండలి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
శ్రీవారి భక్తులు హుండీలలో సమర్పించే కానుకల విషయంలో పాలకమండలి అదేవిధంగా అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితితో పాటు భక్తులను అనుమానించే దుస్థితి కూడా ఏర్పడిందని చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం 2015 -16 మధ్య రద్దు చేసిన 500, వెయ్యి రూపాయల నోట్లను సమర్పించడంతోపాటు గత రెండేళ్ల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లను కూడా ఇప్పటికీ హుండీలలో భక్తులు సమర్పిస్తున్నారు. ఈ విధానం సరికాదనేది టీటీడీ పాలకమండలితో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు పైకి చెప్పలేక, ఇటు ఈ విషయాన్ని సర్దుబాటు చేసుకోలేక నానా ప్రయాస పడుతున్నారు. టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రద్దుచేసిన 500, వెయ్యి రూపాయల నోట్లు ఏకంగా 400 వందల కోట్ల రూపాయల పైబడి టిటిడి ఖజానాలో మూలుగుతున్నాయి.
వీటిని తీసుకునేందుకు అటు బ్యాంకులు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను భద్రపరిచేందుకు నెల నెల తిరుమల తిరుపతి దేవస్థానం రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది.
మరోవైపు రెండు సంవత్సరాల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లును ఇప్పటికీ భక్తులు హుండీలలో సమర్పిస్తున్నారు. వీటి విలువ ప్రతి నెల 30 నుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ నోట్లను కూడా బ్యాంకులు తీసుకోవడం లేదని తద్వారా వాటిని కూడా భద్రపరచాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి పట్ల భక్తి ప్రభత్రులను చాటుకోవాలి తప్ప కానుకల హుండీని తమకు అనుకూలంగా మలుచుకోవద్దని సూచిస్తున్నారు.
తమ అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించుకోరాదని పాలకమండలి విజ్ఞప్తి చేస్తోంది. స్వామి పట్ల భక్తి ఉన్నవారుఎవరూ ఇలా చేయరని.. పేర్కొంది. ఈ విషయంలో భక్తులు ఆలోచన చేయాలని పాలక మండలి సహా అధికారులు చెబుతున్నారు.
This post was last modified on April 10, 2026 7:46 am
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…