Movie News

ధనుష్ మీటింగ్… చాలా కథ ఉంది

తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తమిళ స్టార్ ధనుష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనకు గతంలో నేషనల్ అవార్డులు రావాల్సినపుడు రాలేదని, అప్పుడు ఎవ్వరూ మద్దతుగా మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం విమర్శిస్తున్నారంటూ చేసిన వాదన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే జాతీయ అవార్డు విషయంలో ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. అతను ఏ కార్యక్రమంలో ఇలా మాట్లాడాడు, అసలక్కడ ఏం జరిగింది, ధనుష్ ఇంకా అక్కడ ఎలాంటి కామెంట్స్ చేశాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ధనుష్ తన అభిమానులతో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చాలా భారీగా హాజరైన అభిమానులతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వందల మంది అభిమానులు స్టేజ్ మీదికి రావడం.. ధనుష్‌కు పాదాభివందనాలు చేయడం, అతను వారిని ఆశీర్వదించడం విశేషం.

ఇక ధనుష్ మాట్లాడుతూ.. ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని, ఇలాంటి ఆకమత్యానికి ఒక శక్తి ఉందని.. దీనికి ఒక ప్రయోజనం ఉండాలని వ్యాఖ్యానించాడు. కేవలం ఆడియో వేడుకలు, కలయికలతో సరిపెట్టకుండా అందరూ కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని ధనుష్ పిలుపునిచ్చాడు.

మీ మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, చుట్టు పక్కల కుటుంబాలకు సాయపడాలని.. మిమ్మల్ని చూసి నేను గౌరవించాలని ధనుష్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, అభిమానులకు ఇచ్చిన సందేశాన్ని బట్టి చూస్తే.. మరో తమిళ హీరో రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. విజయ్ కూడా ఇలా అభిమానులను మొబిలైజ్ చేసి ముందుగా సేవా కార్యక్రమాలు చేయించి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను కూడా ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on July 27, 2026 10:21 pm

Share

Recent Posts

తమన్నా కొత్త సినిమా చూడక్కర్లేదా

మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…

4 hours ago

8 నెలలు వెతికిన విలన్ న్యాయం చేశాడా

తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ మీద చర్చలు, ట్రోల్స్, కలెక్షన్ల మీద డిబేట్లు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి.…

4 hours ago

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…

7 hours ago

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

8 hours ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

8 hours ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

8 hours ago