Movie News

చిట్టిబాబుకి ప్యాన్ ఇండియా ప్రాబ్లమ్ లేదు

సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న దగ్గుబాటి అభిమానులకు ఊరట కలిగిస్తూ ఆదర్శ కుటుంబం ఏకే 47 టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ ఫ్యామిలీలోని నాలుగు ముఖ్యమైన క్యారెక్టర్లకు నాలుగు వీడియో టీజర్లు చేయించి ఒక్కొకటి వదులుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే మల్టీమిలియనీర్ బిల్డింగ్ ఇందులోనూ ఉంది. బహుశా హీరో నేపథ్యం కోటీశ్వరుడు కాబోలు.

ఈ మూవీలో వెంకటేష్ చిట్టిబాబు అనే క్యారెక్టర్ చేస్తున్నారు. పెద్ద ఊరట ఏంటంటే ఇదో ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ టచ్ ఉన్న ఎంటర్ టైనర్. ఎలివేషన్లు, వరల్డ్ బిల్డింగ్ లు, ఇతర భాషల ఆడియన్స్ ని మెప్పించాలని తాపత్రయంతో బలవంతంగా పెట్టిన ఎలివేషన్లు, చెవులు హోరెత్తే నేపధ్య సంగీతాలు ఇవేవి ఉండవు. ఫస్ట్ హాఫ్ దాకా సరదాగా నవ్వించి ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు ఇచ్చి రెండో సగం వినోదం ప్లస్ పోరాటాలతో కథను నడిపిస్తారు. అల వైకుంఠపురము తరహాలో అన్న మాట.

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న ఆదర్శ కుటుంబం చెప్పిన టైంకే రిలీజ్ కానుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ప్రాజెక్టు ప్రకటించినప్పుడు సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. తను ఇచ్చిన పాటలు నచ్చలేదో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ ఆ స్థానంలో తమన్ వచ్చి బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోగా సెప్టెంబర్ లో ఫైనల్ కాపీ వచ్చాక రీ రికార్డింగ్ పనులు చేపట్టబోతున్నారు.

ఆదర్శ కుటుంబంకున్న మరో ప్లస్ ఏంటంటే వెంకటేష్ సమాంతర సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ముగ్గురూ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారు. రెండు మాఫియా బ్యాచ్ కాగా మరొకటి లాటరీ వ్యవహారాల మీద నడుస్తుంది. వెంకీది అలా కాదు. కామెడీని హైలైట్ చేస్తూనే క్రైమ్ టచ్ తో డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ భారీ ఫాంటసీ మూవీ చేయబోతున్న నేపథ్యంలో ఆదర్శ కుటుంబం బ్లాక్ బస్టర్ కావడం ఆయనకు చాలా కీలకం. 

This post was last modified on July 27, 2026 7:11 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

4 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

6 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

8 hours ago