చిన్న సినిమాలకు ప్రమోషన్లు చేసి జనాన్ని రప్పించడం కీలకం. ముఖ్యంగా కొత్త ఆర్టిస్టులతో తీస్తున్నప్పుడు ఈ రిస్క్ చాలా ఉంటుంది. కనీసం ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే. చాలా బాగుందని టాక్ వస్తే అప్పుడు ఆడియన్స్ కదులుతారు. ఈ విషయంలో లిటిల్ హార్ట్స్ లాంటివి చాలా ప్లాన్డ్ గా వ్యవహరించి అద్భుత ఫలితాన్ని అందుకున్నాయి. వచ్చే వారం ఏప్రిల్ 17 కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ విడుదల కానుంది. టాలీవుడ్ కి పరిచయం లేని బ్యాచే ఇందులో నటించిన, పనిచేసిన వాళ్ళు.
ముప్పై ఏళ్ళ క్రితం గ్రామాలను ఊపేసిన దూరదర్శన్, వీడియో క్యాసెట్ల ట్రెండ్ ఆధారంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. వ్యక్తిగతంగా కిరణ్ అబ్బవరంకి ఇది బాగా కనెక్ట్ అయిపోవడంతో వెంటనే పట్టాలు ఎక్కించేసి సినిమా పూర్తి చేశాడు. దీనికి చేస్తున్న ప్రమోషన్లు వెరైటీగా జనాల దృష్టిలో పడేలా ఉన్నాయి. నిర్మాత కిరణ్ చెన్నకేశవరెడ్డి క్యాస్టూమ్ లో, హీరో ముఠామేస్త్రి గెటప్ లో, హీరోయిన్ స్వర్గీయ శ్రీదేవి చీరలో ఇలా మొత్తం పాతిక మంది నోస్టాల్జియా దుస్తుల్లో ఈవెంట్ చేశారు.
ఇది ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇదొక్కటే కాదు ట్రైలర్ లాంచ్ ఇలా వెరైటీగా చేయడంతో పాటు దాన్ని ఆన్ లైన్ లో విక్టరీ వెంకటేష్ ద్వారా విడుదల చేయించడం మరో మంచి స్ట్రాటజీ. టీవీ పిచ్చి ఉన్న గ్రామస్థుల మీద అది ఎలాంటి చిక్కులు తీసుకొచ్చింది, హీరో వాటిని ఎలా పరిష్కరించాడు అనే పాయింట్ మీద దర్శకుడు వి మునిరాజు తిమ్మరాజుపల్లి టీవీని తెరకెక్కించారు. ఏప్రిల్ 17 పెద్దగా పోటీ లేని టైం చూసి విడుదల ప్లాన్ చేసుకోవడం కలిసి వచ్చేలా ఉంది.
పబ్లిసిటీ ఎంత కీలకంగా మారిపోతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కిరణే కాదు ఇటీవలే రాకాస కోసం నిర్మాత నీహారిక కొణిదెల ఎంత కష్టపడిందో చూశాం. వెరైటీ కాన్సెప్ట్స్ తో ప్రచారం చేయడంతో పాటు రామ్ చరణ్ సహాయం కూడా తీసుకుంది. ఫలితం ఇంకా తేలలేదు కానీ ఈ ఎఫర్ట్స్ ఓపెనింగ్స్, వీకెండ్ వసూళ్లకు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు తిమ్మరాజుపల్లె కూడా ఇదే రూటు పట్టింది. మరి ప్రొడ్యూసర్ గా కొత్త రోల్ పోషిస్తున్న కిరణ్ కు ఇది ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 10, 2026 9:57 am
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…