ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం భయం గుప్పిట్లో లాఠీ చెప్పుచేతల్లో జీవించాలని అనుకుంటున్నారా? అని నిలదీసింది. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసులు ఏమీ ప్రత్యేకం కాదని.. రాజ్యాంగం అందరికీ సమానంగానే హక్కులు కల్పిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ నెల 20న విద్యార్థులు చలో పార్లమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు- విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీనిలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలపై చర్యలు కోరుతూ.. గాయపడ్డవారికి పరిహారం కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత వీటిని విచారణకు తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది.
అయితే.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సోమవారం వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలను కాపాడేందుకు మాత్రమే పోలీసులు ఉన్నారని.. వారిని కొట్టేందుకు కాదని తెలిపింది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలు చేపట్టేందుకు అన్ని వర్గాల ప్రజలకు హక్కు ఉందని.. వీటిని విచ్ఛిన్నం చేయడం, నిరసన కారులపై పోలీసులు విరుచుకుపడడం సహించరానిదని వ్యాఖ్యానించింది.
పోలీసుల మాటేంటి?
ఇదే సమయంలో ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది స్పందిస్తూ.. విద్యార్థి ఉద్యమంలో కొందరు సంఘ విద్రోహులు చొరబడ్డారని.. వారు పోలీసులపై దాడి చేశారని.. పదుల సంఖ్యలో పోలీసులు కూడా ఆసుప త్రుల్లో చికిత్స పొందుతున్నారని కోర్టుకు వివరించారు. మరి పోలీసుల మాటేంటని ప్రశ్నించారు. దీనిపై కూడా కోర్టు సీరియస్‌గానే స్పందించింది. ఇలాంటి వాటిని కూడా తాము ఖండిస్తామని.. సంఘ విద్రోహకర వ్యక్తులపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని పేర్కొంది. అయితే.. అలాగని సామాన్యులు, శాంతియుత నిరసన కారులపై లాఠీలను ప్రయోగించజాలరని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on July 27, 2026 4:49 pm
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…
ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…
ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్…
మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…
తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ మీద చర్చలు, ట్రోల్స్, కలెక్షన్ల మీద డిబేట్లు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి.…