Trends

ఎవరయ్యా ఈ ముకుల్ చౌదరీ?

​ఐపీఎల్ 2026 సీజన్ లో 15వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఊహించని విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పక్కాగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ ను 21 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు ముకుల్ చౌదరి తన పవర్ హిట్టింగ్ తో మలుపు తిప్పాడు. కేవలం ఒకానొక దశలో ఒత్తిడికి లోనై లక్నో ఓడిపోతుందని భావించిన అభిమానులకు, ముకుల్ ఇన్నింగ్స్ ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది.

​ముకుల్ చౌదరి అంటే ఎవరో కాదు, గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున మెరుపులు మెరిపించిన యువ సంచలనం. అతనిలోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన లక్నో యాజమాన్యం వేలంలో ఏకంగా రూ. 2.60 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలో ముకుల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతనిపై పెట్టిన పెట్టుబడి వృథా అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ కీలక మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లోనే 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి, తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

​లక్నో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవడంతో కేకేఆర్ విజయం దాదాపు ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. ఆయుష్ బదోని (54) ఒకవైపు పోరాడుతున్నా, మరోవైపు వికెట్లు పడుతుండటంతో మ్యాచ్ లక్నో చేజారుతున్నట్లు అనిపించింది. అలాంటి సమయంలో ముకుల్ క్రీజులోకి వచ్చి కేకేఆర్ బౌలర్ల పని పట్టాడు. అనుభవం లేకపోయినా, ఈడెన్ గార్డెన్స్ లాంటి పెద్ద స్టేడియంలో ఏమాత్రం తడబడకుండా భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ముఖ్యంగా సునీల్ నరైన్ లాంటి దిగ్గజ బౌలర్ పొదుపుగా బౌలింగ్ చేసినా, ఇతర బౌలర్లను ముకుల్ టార్గెట్ చేశాడు.

​చివరి ఓవర్.. గెలవడానికి 13 పరుగులు కావాల్సిన సమయంలో వైభవ్ అరోరా వేసిన బంతులను ముకుల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచి స్కోరు సమం చేశాడు. ఇక ఆఖరి బంతికి ఒక పరుగు కావాల్సిన తరుణంలో బ్యాట్ కు బంతి సరిగ్గా తగలలేదు. నిన్నటి మ్యాచ్ లో బట్లర్ చేసినట్లుగా కీపర్ రఘువంశీ వికెట్లను డైరెక్ట్ గా కొట్టి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్లేది. కానీ రఘువంశీ ఆ అవకాశం చేజార్చుకోవడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఆవేశ్ ఖాన్ వేగంగా పరుగు పూర్తి చేసి లక్నోకు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.

ముకుల్ చౌదరి రూపంలో లక్నోకు ఒక నమ్మకమైన ఫినిషర్ దొరికాడని చెప్పాలి. అతనికి రంజీలలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపిలో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. 5 ఇన్నింగ్స్ లలో 173 పరుగులు చేసి 198 స్ట్రైక్ రేట్ తో అందరిని ఎట్రాక్ట్ చేశాడు. టామ్ మూడీ లాంటి దిగ్గజాలు ముకుల్ గురించి ఎందుకు అంతగా గొప్పగా చెప్పారో ఈ మ్యాచ్ తో అర్థమైంది. కేకేఆర్ జట్టుకు ఇది మింగుడుపడని ఓటమి. దాదాపు తమ గుప్పిట్లో ఉన్న మ్యాచ్ ను ఒక కుర్రాడు లాగేసుకోవడం వారి బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా, ముకుల్ చౌదరి రాత్రికి రాత్రే ఐపీఎల్ కొత్త హీరోగా మారిపోయాడు.

This post was last modified on April 10, 2026 6:41 am

Share

Recent Posts

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

8 minutes ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

37 minutes ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

3 hours ago

లోక‌ల్‌వార్‌లో జ‌న‌సేన కోరిక‌లు బాబు తీర్చేనా..?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌న‌సేన నాయ‌కుల కోరిక‌లకు కూట‌మి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్న‌ల్…

5 hours ago

మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…

5 hours ago

‘90స్’తో ఇంటింటికి… ఇప్పుడు టికెట్ కొనిపించాలి!

‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆదిత్య హాసన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్న చిన్న కుటుంబ…

6 hours ago