Trends

మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ మొదలు

​ఐపీఎల్ 2026 సీజన్ సగం కూడా పూర్తికాకముందే సోషల్ మీడియాలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే పదం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం, ఆపై కుల్దీప్ రనౌట్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. కుల్దీప్ రనౌట్ విజువల్స్ సరిగ్గా చూపించలేదని కొందరు, గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పాడు చేసుకున్నారని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గందరగోళం వెనుక అసలు కారణం క్రికెట్ మీద ప్రేమ కంటే.. ఆ మ్యాచ్‌పై కాసిన ‘బెట్టింగ్’ కష్టాల్లోకి నెట్టేస్తోందన్నది చేదు నిజం. ఢిల్లీ లైనప్ చూసి అది ఈజీ విక్టరీ అని బెట్టింగ్ కాసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

​కేవలం ఢిల్లీ మ్యాచ్ మాత్రమే కాదు, మొన్నటి ముంబై వర్సెస్ రాజస్థాన్ పోరు కూడా బెట్టింగ్ రాయుళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ముంబై తన పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్‌తో రాజస్థాన్ కుర్రాళ్లను ఈజీగా ఓడిస్తుందని చాలామంది ముంబైపై భారీగా బెట్స్ వేశారు. కానీ సీన్ కట్ చేస్తే.. అనుభవం లేని వైభవ్, జైస్వాల్ లాంటి కుర్రాళ్లు ముంబై దిగ్గజాలనే వణికించారు. క్రికెట్ అనేది అంచనాలకు అందని ఆట అని ఈ రెండు మ్యాచ్‌లు నిరూపించాయి. బెట్టింగ్ అనేది ఒక తెలివైన స్ట్రాటజీ అని భ్రమపడే వారికి ఈ ఫలితాలు ఒక గుణపాఠమే. చివరి బంతి వరకు ఏం జరుగుతుందో తెలియని ఆటలో డబ్బులు పణంగా పెట్టడం అంటే ఆత్మహత్యతో సమానం.

​ప్రభుత్వం ఎన్ని బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేసినా, పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా.. ఏదో ఒక రూపంలో ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఇల్లీగల్ వెబ్‌సైట్లు యథేచ్ఛగా నడుస్తూ యువతను ఆకర్షిస్తున్నాయి. ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయిపోవచ్చనే ఆశతో వేల రూపాయలు తగలేస్తూ, అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ అనేది ఒక ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే, కానీ దాన్ని ఒక జూదంలా మార్చుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో జరిగిన అనూహ్య పరిణామాలను గమనిస్తే.. బెట్టింగ్ అనేది ఎంత డేంజర్ అనేది స్పష్టమవుతోంది.

​నిజానికి మైదానంలో ఆటగాళ్లు తమ శాయశక్తులా పోరాడుతుంటారు. కానీ బెట్టింగ్ ఓడిపోయిన వారు దాన్ని ‘ఫిక్సింగ్’ అని ముద్ర వేసి తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తుంటారు. డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం వెనుక అతని సొంత స్ట్రాటజీ ఉండవచ్చు, కానీ దాన్ని బెట్టింగ్ కోణంలో చూసినప్పుడు అది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఈ ఇల్లీగల్ సైట్లు మిమ్మల్ని గెలిపించడానికి లేవు, మీ జేబులు ఖాళీ చేయడానికే ఉన్నాయి. గెలుపు ఎవరిదో తెలియని అనిశ్చితిలో కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం క్షేమకరం కాదు.

This post was last modified on April 9, 2026 11:05 am

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

41 minutes ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

1 hour ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

3 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

5 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

9 hours ago