ప్రచారం vs వాస్తవం: ఇరాన్ తో మన స్నేహం ఎంత?

ఇరాన్ తో మనకున్న బంధం.. అనుబంధం చాలా కీలకమైనదని.. మన స్నేహం దశాబ్దాల తరబడి సాగుతోందని చెప్పే మాటలకు.. చేతలకు మధ్య అంతరం ఏమైనా ఉందా? మాటలు చెప్పినట్లే చేతలు సాగుతున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్న. నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తో మన దేశానికి మధ్యనున్న స్నేహం గాఢత ఎంతన్న విషయంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ కు చెందిన 22 నౌకలు భారత్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ.. నౌకలకు అందాల్సిన పూర్తిస్థాయి అనుమతులు సరిగా రావట్లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

నిజంగానే భారత్ కు – ఇరాన్ మధ్య మంచి రిలేషన్స్ సరిగా ఉండి ఉంటే.. దగ్గర దగ్గర రెండు డజన్ల నౌకలు హర్మూజ్ జలసంధి వద్ద రోజుల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. మన మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ జరిగే ప్రచారానికి.. వాస్తవానికి మధ్య అంతరం ఎంత? అన్నది అసలు ప్రశ్న.

మీడియాలో ఉదరగొట్టినట్లుగా ఇరాన్ తో మన స్నేహం అపురూపమైనది ఎంత మాత్రం కాదు. అలా అని దారుణంగా ఉన్న పరిస్థితి లేదు. రెండు దేశాల మధ్య అనుబంధం అవసరంతోనే ముడిపడిందని మాత్రం చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు రెండు దేశాల మధ్య బంధం వాస్తవానికి దగ్గరగా ఉన్న రీతిలో మాట్లాడుకోవటం బాగుంటుంది.

గడిచిన నెల రోజుల్లో జరిగిన పరిణామాల్ని చూసినప్పుడు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ ఏ పక్షం వహించకుండా “తటస్థంగా” ఉంటోంది. ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న రక్షణ సంబంధాలు మరియు అమెరికాతో ఉన్న సాన్నిహిత్యం ఇరాన్‌కు కొంత అసంతృప్తిని కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేవలం స్నేహితుడు అని చెప్పడమే కాకుండా, క్షేత్రస్థాయిలో భారత్ తమకు ఎంతమేర మద్దతుగా నిలుస్తుందో పరీక్షించేందుకు ఇరాన్ ఈ ‘అనుమతుల ప్రక్రియను ఒక సాధనంగా వాడుకునే అవకాశం ఉందని చెప్పాలి.

భారత్ ను సైతం వెయిట్ చేయించాలన్న గేమ్ ప్లాన్ ఇరాన్ అనుసరిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చే వీల్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. హర్మూజ్ జలసంధిపై తమకు ఎలాంటి సార్వభౌమాధికారం ఉన్న విషయాన్ని ప్రపంచానికి ఏ రోజుకు ఆ రోజు తెలిస్తేలా.. మాట్లాడుకునేలా ఇరాన్ చేస్తుందని చెప్పాలి. భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా దేశాలకు ఇరాన్ తన మిత్ర దేశాలుగా పేర్కొంటూ.. నౌకలు హర్మూజ్ వద్ద దారి ఇస్తుందని చెప్పినా.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి.

మనల్ని మిత్రదేశంగా ఇరాన్ చెప్పినప్పటికీ.. చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ దేశాలకు ఇస్తున్న అనుమతుల వేగంతో పోలిస్తే.. భారత్ కు ఇస్తున్న అనుమతుల లెక్క అంతంతేనని చెప్పాలి. తాజా యుద్దం నేపథ్యంలో భారత విదేశాంగ విధానం తటస్థంగా ఉన్న పరిస్థితి. అదే సమయంలో ఇరాన్ – ఇజ్రాయెల్ ను బ్యాలెన్సింగ్ చేయటం చూస్తే.. ఒక సంక్లిష్ట మిత్రుడిగా భారత్ ను ఇరాన్ చూస్తుందని చెప్పకతప్పదు.

స్నేహితుడిగా వ్యవహరిస్తూనే.. కొన్ని సందర్భాల్లో అమెరికా ప్రయోజనం దిశగా భారత అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఇరాన్ సైతం భారత్ ను అడ్డం పెట్టుకొని అమెరికాను ఎలా నిలువరిస్తారన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా చెప్పాలి.

ఒక విధంగా చెప్పాలంటే భారత నౌకలు ఆలస్యమయ్యే కొద్దీ.. అమెరికాతో మాట్లాడి దాడులు ఆపించేందుకు వీలుగా అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు. సింఫుల్ గా చెప్పాలంటే భారత నౌకల్ని నిలువరిస్తే.. అమరికాతో మాట్లాడి దాడులు ఆపించాలని ఇరాన్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీద పెట్టే ఒత్తిడి నిజంగానే వర్కువుట్ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.