ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ దూకుడు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం, తెలంగాణా లో ఉచిత బస్సు ప్రయాణం, తమిళనాడులో మామయ్య ఉంగరం వంటి పథకాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ఒక అడుగు ముందుకు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక ప్రయోజనం కలిగించే పథకాలు చేపడుతుండగా మరికొన్ని రాష్ట్రాలు దీర్ఘాకాలిక ప్రయోజనం కలిగించే పథకాలను అమలు చేస్తున్నాయి.
11.80 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …
దాదాపుగా దేశం మొత్తం మధ్యాహ్న భోజన పథకం అమలులో వుంది. జాతీయ స్థాయిలో 1995 ఆగస్టు 15 వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. తమిళనాడులో మాత్రం 1950 లలోనే దీన్ని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 11.20 లక్షల ప్రాధామిక, ప్రాధమికోన్నత, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 11.80 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షల మంది, తెలంగాణాలో 18 లక్షల మంది విద్యార్థులు వున్నారు.
భోజనంలో మెనూ ఇదే…
దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లోనూ కాస్త అటు ఇటుగా ఒకే రకమైన మెనూ అమలు చేస్తున్నారు. అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ, పులిహోర, రాగిజావ, పచ్చడి, గోంగూర వడ్డీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో వారంలో ఒక రోజు వెజ్ పలావు,బంగాళదుంప కుర్మా వడ్డీస్తున్నారు. వేరుశనగ చిక్కీలు కామన్.
విద్యార్థులకు వారానికో రోజు బిర్యానీ…
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం వచ్చాక సరికొత్తగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం పథకంలో వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ వడ్డించాలన్న ప్రతిపాదానలను పరిశీలిస్తుంది. విద్యాశాఖ మంత్రి ఏ. రాజ మోహన్ నేతృత్వంలో ఇటీవల 150 ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులకు వారానికి ఒకసారైనా చికెన్ బిర్యానీ వడ్డించాలన్న డిమాండ్ వచ్చింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
