Trends

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల జరిమానా విధించడమే కాకుండా, సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 50 లక్షల భారీ పెనాల్టీ వేసింది.

రితేష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడు మార్చి 15న ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు వడ్డించిన భోజనంలో పురుగులను గుర్తించారు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో పెరుగు గిన్నెలో పురుగులు కదులుతున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. అక్కడే ఉన్న ట్రైన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్న దృశ్యాలను కూడా వీడియో తీశారు. ఇతర ప్రయాణికులు కూడా అక్కడికి చేరుకుని అధికారులను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో చర్చకు దారితీయడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని స్పష్టం చేసింది. నాసిరకం భోజనాన్ని అందించిన సదరు సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. భారీ జరిమానాలు విధించడం ద్వారా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠిన సంకేతాలను పంపింది.

వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చోట కూడా ఇలాంటి అశుభ్రమైన ఆహారం వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీ సమయంలో కూడా పురుగులు స్పష్టంగా కనిపిస్తుండటంతో కేటరింగ్ విభాగానికి బాధ్యత లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దీంతో అతన్ని అందరూ అపరిచితుడు సినిమాలోని రామానుజం పాత్రతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి సంధర్భాల్లో మనకెందుకులే అని వదిలేసే ఈరోజుల్లో ఇంత పట్టుతో రైల్వే శాఖను కదిలించాడని మెచ్చుకుంటున్నారు.

This post was last modified on March 26, 2026 1:20 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago