ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు చాలా మటుకు ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. పేరున్న దర్శకులు, పెద్ద బ్యానర్లే వచ్చినా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండుగా మిగిలిపోయింది. భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల సైతం రాబిన్ హుడి అనే అవుట్ డేటెడ్ మూవీ తీశారంటే నితిన్ లెక్క ఎక్కడ తప్పుతోందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా తనకు బాక్సాఫీస్ తత్వం అర్థమైనట్టు ఉంది.
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందబోయే అలియాస్ రుక్మిణిలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ కాంబో గురించి వారం రోజులుగా వార్తలు తిరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక చిన్న వీడియో టీజర్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. శృంగార నవలలు రాసే ఇంజనీరింగ్ కుర్రాడు వాటి ద్వారా తన కలం పేరు రుక్మిణితో పాఠకులకు దగ్గరవుతాడు. ఎవరైనా రుక్మిణి ఎవరని అడిగితే నా భార్య పేరు అంటాడు. ఇంతకీ ఆమె నిజంగా వైఫా, తనే ఆ బుక్కులు రాసిందా అనేది తెరమీద చూడాలి.
దండోరా లాంటి సీరియస్ కాన్సెప్ట్ తో విమర్శకులను మెప్పించిన దర్శకుడు మురళికాంత్ దేవసోత్ ఈసారి రూటు మార్చి వినోదం వైపు వచ్చేశారు. స్టోరీ పాయింట్ చూస్తుంటే నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మాములుగా అయితే ఈ కాలంలో నవలలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం చూస్తుంటే మురళికాంత్ వెనక్కు వెళ్లి ఏదైనా 90 దశకం కథ చెబుతారా లేక కొత్తగా ట్రై చేశారా అనేది ఇప్పుడే చెప్పలేం. డిఫరెంట్ ఫీలైతే ఇచ్చారు.
మొత్తానికి నితిన్ అయితే దారిలో పడినట్టే అని చెప్పాలి. ఇప్పుడు తనకు కావాల్సింది మసాలా సినిమాలు కాదు. అలా ఆలోచించే మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, తమ్ముడు లాంటి దారుణమైన ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది. కానీ అలియాస్ రుక్మిణి ఆ క్యాటగిరీలోకి రాదు కాబట్టి అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. ప్రస్తుతం సితార బ్యానర్ లో రూపొందుతున్న మూవీ కూడా ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగానే ఉంటుందట. ఇవి వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
This post was last modified on August 3, 2026 11:00 am
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…