పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గత వారం విడుదల కావాల్సిన ‘టాక్సిక్’ మూవీ వాయిదా పడిందని.. ఆ వారంలో ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయని టెంప్ట్ అయి విడుదలను ఒక వారం ముందుకు జరిపారు. కానీ ‘దురంధర్: ది రివెంజ్’ నుంచి వచ్చే ముప్పును టీం పసిగట్టలేకపోయింది.
హిందీ సినిమా కదా అని దాన్ని తక్కువ అంచనా వేసింది. ఫలితంగా సినిమాకు గట్టి దెబ్బే తగిలింది. ఓవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఆశించిన టాక్ రాలేదు. మరోవైపు ‘దురంధర్-2’కు టాక్ అదిరిపోయింది. ఫలితంగా ‘ఉస్తాద్’ మీద ప్రతికూల ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ వరకు వసూళ్లు ఓకే కానీ.. తర్వాత సినిమా చల్లబడిపోయింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది.
ఐతే ఈ వీకెండ్లో పెద్ద రిలీజ్‌లు లేకపోవడం ‘ఉస్తాద్’కు కలిసొచ్చే విషయం. ‘కోర్టు’ జంట నటించిన ‘బ్యాండ్ మేళం’ అనే చిన్న సినిమా ఒకటి రిలీజవుతోంది. దీంతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ వస్తున్నాయి. ఇవి ఏమేర ప్రభావం చూపుతాయన్నది సందేహమే. శుక్రవారం శ్రీరామనవమి సెలవు ఉంది. తర్వాతి రెండు రోజులు వీకెండ్. ఇది బాక్సాఫీస్ పరంగా బాగా కలిసొచ్చే విషయం.
వీక్ డేస్‌లో ఎంత వీక్ అయినప్పటికీ.. ఈ మూడు రోజులు మంచి వసూళ్లు రాబట్టడానికి ‘ఉస్తాద్’కు అవకాశం ఉంది. కొత్త సినిమాలను మించి దీన్నే తెలుగు ప్రేక్షకులు ప్రిఫర్ చేసే అవకాశముంది. కాబట్టి ‘ఉస్తాద్’ రన్ అయిపోయినట్లు కాదు. ఒక రకంగా ఇది ఆ సినిమాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
బయ్యర్లు ఆల్రెడీ నష్టాలకు రెడీ అయిపోయారు. కానీ నష్టాల శాతం ఎంత మేర తగ్గుతుందో ఈ వీకెండ్ నిర్ణయిస్తుంది. సోమవారం నుంచి మాత్రం వసూళ్లు ఆశించడానికి ఉండదు. ఈ ఆదివారంతో రన్ దాదాపు ముగిసినట్లే. ఈలోపు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2026 3:05 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…