ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది.
జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ప్రకారం, ఈ ముగ్గురు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ , ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో ‘గజ్వా-ఏ-హింద్’ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
దేశంలోని పలు రాష్ట్రాలకు వీరి నెట్‌వర్క్ విస్తరించినట్లు కూడా తేలింది. అంతేకాకుండా, ఉగ్రవాద శిక్షణ కోసం త్వరలోనే పాకిస్థాన్‌కు వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. సోమవారం విజయవాడలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రహమతుల్లా, అంతర్జాతీయ ఉగ్రవాద నేతల విద్వేషపూరిత వీడియోలను చూస్తూ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థల ఖాతాలను అనుసరించడమే కాకుండా, సంబంధిత వీడియోలను పంచుకుంటూ ప్రచారం సాగించాడు.
భవానీపురానికి చెందిన మహమ్మద్ దానిష్, మహంతిపురానికి చెందిన మీర్జా సొహైల్ బేగ్‌లతో కలిసి ఈ కార్యకలాపాలను విస్తరించాడు. విదేశీ హ్యాండ్లర్ ‘అల్-హకీం షుకూర్’తో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని, అతని సూచనల మేరకు బిహార్‌కు చెందిన షాద్మన్ దిల్కుష్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగంతో సంబంధాలు నెలకొల్పాడు.
అనంతరం ‘బెన్‌ఎక్స్ కామ్’ గ్రూప్ ద్వారా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న అజ్మానుల్లా ఖాన్ (బిహార్), లక్కీ అహ్మద్ (దిల్లీ), మీర్ ఆసిఫ్ అలీ (పశ్చిమబెంగాల్), జీషాన్ (రాజస్థాన్), అబ్దుల్ సలామ్ (కర్ణాటక), షారుక్ ఖాన్, షియాక్ ఫియాజ్ ఉర్ రెహ్మాన్ (మహారాష్ట్ర) తదితరులతో సంబంధాలు పెంచుకున్నట్లు తేలింది.
సామాజిక మాధ్యమాల్లో మాస్కులు ధరించి ‘ముజాహిదీన్లు’గా ప్రకటించుకుంటూ పోస్టులు పెట్టిన వీరు, ఒసామా బిన్ లాడెన్ వీడియోలను అనుకరిస్తూ వేషధారణ, ప్రవర్తనలో మార్పులు సాధన చేసినట్లు గుర్తించారు. జాతీయ చిహ్నాలను అవమానిస్తూ, ఐసిస్‌కు మద్దతుగా ప్రచారం చేయడం, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో యువతను తీవ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ప్రభావితం చేసి, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ వంటి దేశాలకు పంపించి మిలిటెంట్ శిక్షణ పొందేలా ప్రేరేపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
This post was last modified on March 25, 2026 9:58 am
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…