Trends

ఐపీఎల్ 2026: అతి పెద్దోళ్ళు vs అతి చిన్నోళ్లు

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కి ఉన్న క్రేజే వేరు. ఇక్కడ ఒకవైపు అనుభవజ్ఞులైన దిగ్గజాలు ఉంటే, మరోవైపు ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న కుర్రాళ్లు ఉంటారు. ఈ 2026 సీజన్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టోర్నీలో ఆడుతున్న పెద్ద వయస్కుడికి, చిన్న వయస్కుడికి మధ్య ఏకంగా 29 ఏళ్ల తేడా ఉంది. మార్చి 28 నుంచి మొదలయ్యే ఈ పోరులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నుండి 44 ఏళ్ల ధోనీ వరకు అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఈ సీజన్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే (2011, మార్చి 27) రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఇతను, గత ఏడాది అద్భుతమైన సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న వైభవ్, ఈసారి తన రెండో ఐపీఎల్ సీజన్‌లో ఏ రేంజ్‌లో చెలరేగుతాడో చూడాలి. అలాగే సీఎస్‌కే ప్లేయర్ ఆయుష్ మాత్రే (18), ఆర్సీబీ స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్ (18) వంటి కుర్రాళ్లు కూడా ఈసారి తమ ముద్ర వేయాలని చూస్తున్నారు.

సీనియర్ల విషయానికి వస్తే, 44 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. 2008 నుండి ఇప్పటివరకు అన్ని సీజన్లు ఆడిన అతికొద్ది మందిలో ధోనీ ఒకరు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోయాల్సి వచ్చింది. బహుశా ఇదే ధోనీకి ఆఖరి సీజన్ కావొచ్చనే ప్రచారం జరుగుతుండటంతో, అభిమానులు అతన్ని మైదానంలో చూసేందుకు ఆత్రుతగా ఉన్నారు. ధోనీతో పాటు రోహిత్ శర్మ (38), విరాట్ కోహ్లీ (37) వంటి సీనియర్లు కూడా తమ అనుభవంతో జట్లను నడిపించబోతున్నారు.

ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఈ సీజన్ చాలా ప్రత్యేకం. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించి, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 8,500 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ, తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో మరోసారి పరుగుల వరద పారించాలని కసితో ఉన్నాడు.

అటు కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే (37), గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మ (37) కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. నిజానికి ఐపీఎల్ అంటేనే టాలెంట్ కి దొరికే ఒక పెద్ద ప్లాట్‌ఫామ్. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే మాట్లాడుతుంది. ఒకవైపు సునీల్ నరైన్ (37) లాంటి మిస్టరీ స్పిన్నర్లు 200 వికెట్ల రికార్డుకు చేరువలో ఉంటే, మరోవైపు యువ బ్యాటర్లు వారి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

This post was last modified on March 24, 2026 7:21 pm

Share

Recent Posts

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

27 minutes ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

2 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

2 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

4 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

4 hours ago