Movie News

పవన్ సినిమాలు చెయ్యడంలో తప్పు లేదు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇది అనైతికమని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పునిచ్చారు. దీనిపై ఇదివరకే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఆయన సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలోనూ నిబంధనలను పాటించలేదని.. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించడంతో పాటు ఈ వ్యవహారం మీద స్వతంత్ర వ్యవస్థతో విచారణ జరిపించాలని కూడా పిటిషనర్ కోరారు.

ఐతే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్, అడిషనల్ ఏజీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించారు. ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి పిటిషనే వేయగా.. ప్రభుత్వ పదవుల్లో ఉంటూ నటించడానికి అభ్యంతరం ఏమీ లేదని అప్పటి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకించారు.

తన సినిమాల టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి.. పవన్ కళ్యాణ్‌కు ఏ సంబంధం లేదని.. ఆయా చిత్రాల నిర్మాతల విజ్ఞప్తి మేరకు నిబంధనలను అనుసరించే రేట్లు పెంచుతున్నారని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో వేసిన వ్యాజ్యం ఇదని.. దీనికి విచారణ అర్హత కూడా లేదని వాదనలు వినిపించారు. దీనిపై సంతృప్తి చెందిన హైకోర్టు న్యాయమూర్తి విజయ్ కుమార్ పిటిషన్‌ను కొట్టివేశారు.

This post was last modified on March 25, 2026 12:48 pm

Share

Recent Posts

రావణుడికి సీతమ్మ సర్టిఫికెట్ ఇవ్వడమేంటి

ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…

36 minutes ago

ఏకగ్రీవాలతో కూటమి పార్టీల హై హై

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో…

38 minutes ago

వారణాసి హైప్ కోసం టెన్షన్ ఎందుకంటే

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమాకు ప్రత్యేకంగా హైప్ కావాలా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు.…

1 hour ago

కోటి రూపాయల స్కీములు పని చేస్తాయా

ఎల్లుండి ఆదర్శ కుటుంబం, కల్ట్ తో పోటీ పడుతున్న చిన్న సినిమా కిల్లర్. పూర్వజ్ అనే దంపతులు పరిమిత బడ్జెట్…

2 hours ago

శంకర్ చేసిన తప్పేంటో తెలిసిపోయింది

మెగా ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేని డిజాస్టర్ గేమ్ ఛేంజర్. మూడేళ్ళ రామ్ చరణ్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు…

3 hours ago

ఉప్పాడను కుదిపేసిన అర్నబ్ తుఫాను

అర్నబ్ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో…

5 hours ago