వివాహేతర సంబంధాలు ఎంతకైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భర్తలపై భార్యలు, భార్యలపై భర్తలు కసి తీర్చుకుంటున్నారు.(అందరూ కాదు.. 100కు 3 శాతం మంది అనిఇటీవల సర్వేలు చెప్పాయి) ఈ క్రమంలో భర్తలను హత్య చేయిస్తున్న భార్యల సంగతులు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా గురువారం ఏపీలోని నంద్యాలలోనూ ఇలాంటి వివాహేతర సంబంధం వెలుగుచూసింది. ఈ ఘటనలో భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. అతనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. అయితే.. పోలీసు విచారణలో `వాస్తవం` వెలుగు చూసి.. మొత్తంగా ప్రియుడు, భార్య కూడా జైలుకు వెళ్లారు.
ఇక, తాజాగా గురువారం ఉత్తర ప్రదేశ్‌లో మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త.. తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించాడు. దీంతో ఆమె మాట్లాడుతున్న ఫోన్‌ను తీసుకుని చూడగా.. దాని `బ్లూ డ్రమ్` కథనంతోపాటు.. భర్తలను ఎలా హత్య చేయాలన్న యూట్యూబ్ లింకులు కూడా కనిపించాయి. దీంతో హడలిపోయిన సదరు భర్త.. ఆమెతో మంచిగా మాట్లాడి.. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భార్యతో చేతులు కలిపించి మరీ సాగనంపాడు.
ఏం జరిగింది?
యూపీలోని బులందేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌కు మూడేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు.. ఆరు మాసాల బిడ్డ కూడా ఉంది. అయితే.. ఇటీవల ఆమె సమీపంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధంలో పడింది. ఇది ప్రేమగా మారి.. పుట్టింటి పేరుతో ప్రియుడితో కలిసి తిరగడం ప్రారంభంచింది. ఈ విషయం భర్తకు తెలిసి.. ఒకసారి మందలించాడు. ఈ క్రమంలో తాను తప్పు చేయడం లేదని చెప్పిన భార్య ఏమాత్రం మారలేదని గ్రహించాడు.
ఇక, ఇటీవల ఆమె ఫోన్‌ను చూడగా.. దానిలో అనేక వీడియోలు.. కనిపించాయి. ప్రియుడు, ఆమె కలిసి ఉన్న ఫొటోలు, ఏకాంత వీడియోలు కూడా దర్శనమిచ్చాయి. వీటితోపాటు బ్లూడ్రమ్ స్టోరీ సహా పలు లింకులు కూడా కనిపించాయి. దీంతో హడలిపోయిన భర్త.. ఆమెను ప్రియుడితో పంపించేసి.. బిడ్డను మాత్రం తన దగ్గర ఉంచుకున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేస్తామని చెప్పినా.. ఏమో.. తనను చంపేస్తారేమోనని కేసును కూడా వెనక్కి తీసుకున్నాడు.
ఏంటీ బ్లూ డ్రమ్ స్టోరీ..
ఇటీవల కాలంలో బ్లూ డ్రమ్ స్టోరీ ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. తన భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది. ప్రియుడితో కలిసి.. ఆ ముక్కలను ఓ బ్లూడ్రమ్(నీళ్ల కోసం వినియోగించేది)లో వేసి.. దానిని సిమెంటు+ఇసుక మిశ్రమంతో పూడ్చేసింది. అనంతరం.. గుమ్మంలోనే పెట్టుకుంది. అయితే.. ఆ డ్రమ్ ముందు.. కుక్కలు పెరిగిపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు డ్రమ్‌ను పగలకొట్టి చూడగా.. శరీర భాగాలు వెలుగు చూశాయి. అప్పటి నుంచి ఈ ఘటన బ్లూ డ్రమ్ స్టోరీగా ప్రచారంలోకి వచ్చింది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్‌ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…