దాదాపు దశాబ్ద కాలం నుంచి హీరో అల్లు అర్జున్‌కు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పడట్లేదన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతి మెగా హీరో సినిమా వేడుకలోనూ పవన్ కోసం అభిమానులు అదే పనిగా నినాదాలు చేస్తుండడంతో ఒళ్లు మండి బన్నీ వారికి చెప్పను బ్రదర్ అని కౌంటర్ ఇవ్వడంతో మొదలైంది ఈ గొడవ.
తర్వాత తర్వాత మెగా గొడుగు నుంచి బయటికి వెళ్లి సొంత ఇమేజ్ కోసం బన్నీ ప్రయత్నం చేయడం.. చిరు, పవన్‌ల గురించి మాట్లాడ్డం తగ్గించేయడం.. తనకు తాను పెద్ద స్టార్‌గా ఫీలవడం లాంటి కారణాలు చూపించి పవన్ ఫ్యాన్స్ తన మీద వ్యతిరేకతను మరింత పెంచుకున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. 2024 ఎన్నికల ముంగిట వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి కోసం బన్నీ ప్రచారానికి వెళ్లడంతో ఇరువురి మధ్య గ్యాప్ కాస్తా ఆగాథంగా మారింది. అది ఎంతకీ పూడని విధంగా తయారైంది. ఇప్పుడు బన్నీ పేరెత్తితే పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇలాంటి టైంలో బన్నీ చేసిన పని.. పవన్ అభిమానుల్లో మరింత మంట పుట్టించాడు. నిన్న అతను దురంధర్: ది రివెంజ్ సినిమాను కొనియాడుతూ ఒక పోస్టు పెట్టాడు. బన్నీ ఇలా తనకేదైనా సినిమా నచ్చితే తన అభిప్రాయం చెబుతూ, టీంను కొనియాడుతూ పోస్టు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు దురంధర్-2 పోస్టు పెట్టిన టైమింగే పవన్ అభిమానులకు నచ్చలేదు.
ఎందుకంటే ఈ చిత్రంతో పాటే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు పవన్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అలాగే సెలబ్రెటీల రివ్యూలు కూడా వస్తున్నాయి. కానీ బన్నీ మాత్రం పవన్‌కు విష్ చేయలేదు. అలాగే ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్నీ చెప్పలేదు. ఇది అతడి ఛాయిస్ అనుకోవచ్చు. కానీ పవన్ అభిమానులు మాత్రం దీన్ని కవ్వింపు చర్యగానే చూస్తున్నారు.
ఎన్నికలప్పుడు వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లడాన్ని దీంతో పోలుస్తున్నారు. పవన్ సినిమాకు పోటీగా ఉన్న చిత్రానికి ఎలివేషన్ ఇస్తూ పోస్టు పెట్టడం కావాలని చేసిన పనే అంటూ అతణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎటాక్ చేస్తున్న వారికి బన్నీ మద్దతుదారులు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. చూస్తుంటే ఈ గొడవ ఎంతకీ తెగేలా లేదు.
This post was last modified on March 20, 2026 12:53 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…