Trends

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది.

త్యాగరాజ వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజిన్‌లో సమస్య ఉండటంతో బైక్‌ను బోర్ చేసిన అనంతరం రాత్రంతా స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ సూచించినట్లు సమాచారం. దీంతో మురళి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇంటి గదిలోనే స్టార్ట్‌లో ఉంచి తలుపులు మూసివేశాడు.

శనివారం రాత్రి మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన ఇంట్లోని గదిలో నిద్రపోయారు. మురళి, అతని భార్య రేవతి మాత్రం ఇంటి పై అంతస్తులోని గదిలో నిద్రించారు. ఇల్లు ఇరుకుగా ఉండటం, గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రాత్రంతా బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ గదిలో వ్యాపించింది. దీంతో ఆ గదిలో నిద్రిస్తున్న తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఉదయం వరకు వారు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గదిలోకి వెళ్లి చూడగా నలుగురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులతో పాటు కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో త్యాగరాజ వీధి ప్రాంతంలో శోకసంద్రం నెలకొంది. స్థానికులు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.

This post was last modified on March 15, 2026 7:43 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

2 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

4 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

5 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

5 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

6 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

6 hours ago