మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మెగా 158 నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద రకరకాలా పుకార్లు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిర్మాతల వైపు నుంచి ప్రెస్ నోట్ వచ్చింది కాబట్టి మెగాస్టార్ – బాబీ కాంబో త్వరలోనే స్టార్టయ్యే సూచనలున్నాయి. అయితే సెట్స్ పైకి వెళ్ళేదాకా మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు.
ఇది కాసేపు పక్కనపెడితే అసలు విశ్వంభర విడుదల ఎప్పుడో అర్థం కాక ఫ్యాన్స్ అయోమయం చెందుతున్నారు. యువి క్రియేషన్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. కపుల్ ఫ్రెండ్లి ఓ మోస్తరుగా ఆడింది కానీ లాభాల వర్షం కురిపించలేదు. దాని బడ్జెట్ కు తగ్గట్టు డీసెంట్ అనిపించుకుంది. బైకర్ ఏదైనా బ్లాక్ బస్టర్ సాధిస్తే తప్ప యూవీ బృందానికి ఊపొచ్చేలా లేదు. శర్వానంద్, రాజశేఖర్ కాంబినేషన్ తో ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.
సో బైకర్ ఫలితం వచ్చాకే విశ్వంభర గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇంత సుదీర్ఘంగా మౌన వ్రతం చేయడం విశ్వంభరకు అంత సేఫ్ కాదు. ఎందుకంటే నాలుగు వందల కోట్ల బడ్జెట్ గా చెప్పబడుతున్న ఈ మెగా ఫాంటసీ మూవీ మీద సాధారణ ప్రేక్షకుల్లో బజ్ లేదు. ఫ్యాన్స్ కూడా అనుమానంగానే చూస్తున్నారు. రెండు టీజర్లు, శ్రీరామనవమి పాట ఆశించిన హైప్ తేలేకపోయాయి. ఇక భారమంతా ట్రైలర్ మీద ఉంది. ఇది మాత్రం అంచనాలు దాటేయాలి.
ఇన్ సైడ్ టాక్ అయితే జూలై రిలీజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఓటిటికి సంబంధించి జీ5 మంచి రేట్ ఇచ్చిందనే టాక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. సరైన ట్రైలర్ పడితే థియేటర్ బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉండవు. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కాకపోతే ఈ రేంజ్ లో విజువల్ గ్రాండియర్ ఉందనే హామీ విశ్వంభర పబ్లిసిటీలో కనిపించాలి. ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. చిరంజీవి ఈ మధ్య దీని ప్రస్తావన తేవడం లేదు. తనను కలిసిన మీడియా ప్రతినిధుల దగ్గర కూడా ఈ టాపిక్ దాటవేశారట. సో చూస్తుంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉందిగా..
This post was last modified on March 16, 2026 5:18 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…