Trends

జెన్ జీ అండతో ప్రధానిగా ర్యాపర్… ఎవరీ బాలెన్ షా?

నేపాల్ రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద మార్పు చోటుచేసుకుంది. దేశంలో దశాబ్దాలుగా ఏలుతున్న పాత తరం నాయకులను కాదని, యువత అంతా ఒక ర్యాపర్ వెనుక నిలిచింది. ఖాట్మండు మేయర్‌గా గుర్తింపు పొందిన బాలేంద్ర షా (బాలెన్) ఇప్పుడు దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మొన్నటి వరకు పాటలతో, సోషల్ మీడియా పోస్టులతో వ్యవస్థను ప్రశ్నించిన ఈ 35 ఏళ్ల యువకుడు, ఇప్పుడు ఏకంగా దేశ గమనాన్ని మార్చే కీలక స్థానానికి చేరుకోవడం విశేషం. జెన్ జీ ప్రతినిధిగా పిలవబడే బాలెన్ షా రాకతో నేపాల్‌లో పాత పార్టీల హవాకు తెరపడినట్లయింది.

ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. 2022లో ఖాట్మండు మేయర్‌గా గెలిచినప్పటి నుండి బాలెన్ షా తనదైన శైలిలో దూసుకుపోయారు. నగరంలో ఆక్రమణల తొలగింపునకు బుల్డోజర్లను వాడటం, అవినీతిపై గళమెత్తడంతో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

గతేడాది నేపాల్‌లో జరిగిన యువత తిరుగుబాటు #GenZRevolt సమయంలో అతను పోషించిన పాత్ర కీలకం. అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోవడానికి, వ్యవస్థలో మార్పు రావాలని కోరుకునే లక్షలాది మంది యువకులు రోడ్లపైకి రావడానికి బాలెన్ పాటలు, సోషల్ మీడియా సందేశాలే ఆయుధాలుగా నిలిచాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా సాగింది. మాజీ ప్రధాని ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించి బాలెన్ సంచలనం సృష్టించారు. కేవలం అవినీతి నిర్మూలన మాత్రమే కాకుండా, రాబోయే ఐదేళ్లలో నేపాల్ తలసరి ఆదాయాన్ని 1,500 డాలర్ల నుండి 3,000 డాలర్లకు పెంచుతామని, పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఈ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ఆశయాలే సామాన్య ఓటర్లను ఆకర్షించి, వారిని అధికారానికి దగ్గర చేశాయి.

అయితే, అధికారంలోకి రావడం ఒకెత్తయితే, దేశాన్ని నడపడం మరో ఎత్తు. బాలెన్ షా గతంలో సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మేయర్‌గా ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు తన కారును ఆపినందుకు ఏకంగా సచివాలయానికే నిప్పు పెడతానని వ్యాఖ్యానించడం ఆయన దూకుడు స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే పొరుగు దేశాలైన భారత్, చైనాతో పాటు అమెరికాను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన దౌత్య నీతిపై సందేహాలను కలిగిస్తున్నాయి.

కొత్త ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించడంతో పాటు, విదేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది నేపాలీల భద్రతను పర్యవేక్షించడం బాలెన్ టీమ్‌కు మొదటి పరీక్షగా మారనుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న సుమారు రెండు మిలియన్ల మంది కార్మికుల క్షేమ సమాచార బాధ్యత వీరిపైనే ఉంది.

ఒక ప్రభావశీలిగా గెలిచిన బాలెన్, ఇప్పుడు ఒక పరిణతి చెందిన ప్రధానిగా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఏదేమైనా నేపాల్ ప్రజలు మార్పును కోరుకుంటూ ‘గంట’ గుర్తుకు ఓటేశారు. బాలెన్ షా తన అనుభవలేమిని అధిగమించి, పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నారు. ఒక ర్యాపర్ పాటలు దేశానికి జాతీయ గీతాలయ్యాయి, మరి అదే వ్యక్తి పాలన నేపాల్ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

This post was last modified on March 8, 2026 1:41 am

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

33 seconds ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

30 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago