తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల మధ్య కూర్చున్న ఒక వ్యక్తిని చూసి బస్టాండ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అతను మహిళ కాదు, ఒక యువకుడని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్టాండ్ ఆవరణలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఒక వ్యక్తి బుర్ఖా ధరించి కూర్చున్నాడు. అతని నడక, ప్రవర్తనలో తేడా గమనించిన అక్కడి సిబ్బంది అతన్ని నిలదీశారు. అతను ఒక పురుషుడని గుర్తించిన తర్వాత, అసలు ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
అయితే ఆ యువకుడు మాత్రం దేనికీ సరైన సమాధానం చెప్పకుండా, ఏదో లోకంలో ఉన్నట్లు నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పొందడానికే అతను ఈ వేషం వేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి వింత వేషధారణతో బస్సు ఎక్కాలని ప్లాన్ చేశాడా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
పోలీసులు ఎంత అడుగుతున్నా ఆ యువకుడు మాత్రం సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఏదో సరదా కోసం చేశాడా లేక నిజంగానే ఫ్రీ బస్ కోసమే ఇలా వేషం మార్చాడా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ వింత వేషధారణ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఫ్రీ బస్ కోసమే అయితే ఇంత సాహసం చేస్తారా అని కొందరు అంటుంటే, ఇంకేదైనా కారణం ఉందేమోనని మరికొందరు అనుమానిస్తున్నారు.
This post was last modified on February 18, 2026 2:13 pm
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…