Movie News

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళను దేవుళ్ళుగా భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భాల్లో కింద కూర్చుంటే, కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ ముందే కుర్చీల్లో ఉన్నా ఏమి అనుకోకుండా పరస్పరం సంస్కారం చూపించిన గొప్ప రోజులు ఒకప్పుడు ఉండేవి.

కానీ ఇప్పుడు అలా లేదు. స్టార్లు, డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయి. వందల కోట్లు పెడుతున్నా, ఎంత అగ్ర నిర్మాత అయినా సరే వీళ్ళ మాటను జవదాటే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణముంది.

ఇటీవలే ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్ లో నిర్మించిన రిసార్ట్, స్పాలను ప్రారంభించేందుకు తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఇందులో పాల్గొన్న దిల్ రాజు కొన్ని చేదు నిజాలు చెప్పారు.

ఒకప్పుడు నిర్మాతలు అందరినీ శాసించే వారని, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్ళను శాసించే స్టేజికి వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దిల్ హిందీ రీమేక్ హక్కులను ఉచితంగా ఇవ్వాలనుకున్న ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సింపుల్ గా చెప్పినా ఆయన మాటల్లో నిగూడార్థం ఉంది.

ప్యాన్ ఇండియా మార్కెట్ లో నిర్మాతలు నలిగిపోతున్నారు. కోట్లకు కోట్లు మంచి నీళ్ళలా ఖర్చువుతున్నా అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ చేయలేక, వాటి మీద వడ్డీలు కట్టలేక, వాయిదాలు, కోర్టు కేసులంటూ మాములు నరకం చూడటం లేదు.

ఇంత భరించినా సినిమా ఏ మాత్రం అటుఇటు అయినా మళ్ళీ పెట్టుబడి పుట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎందరో. చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు కనిపిస్తాయి. దిల్ రాజు అన్నట్టు ఒకప్పటి రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో. వినడానికి సొంపుగా ఉన్నా ఇప్పుడప్పుడే ఇవన్నీ మారేది కాదు కానీ, హీరోలు, దర్శకుల ఆలోచనా ధోరణి ఎంతో కొంత ఛేంజ్ వస్తే మంచిదే.

This post was last modified on February 18, 2026 4:55 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

37 minutes ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

1 hour ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago