Trends

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా పెరిగిపోయాయి. బాగా డ‌బ్బున్న వాళ్ల‌యితే ప‌దుల కోట్లు పెట్టి కూడా ల‌గ్జ‌రీ విల్లాలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల్లో ఒక‌టైన హైద‌రాబాద్‌లో రూ.50 కోట్ల‌కు పైగా రేటు ఉన్న విల్లాలు కూడా ఉన్నాయి.

గ‌త కొన్నేళ్ల‌లో హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ డౌన్ అయిన‌ప్ప‌టికీ.. ఈ ల‌గ్జ‌రీ విల్లాలు కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. ఐతే రూ.50-60 కోట్ల విల్లా అంటేనే వామ్మో వాయ్యో అనుకుంటాం.. అలాంటిది భాగ్య‌న‌గ‌రంలో వంద కోట్ల రేటుతో విల్లాలు రాబోతున్నాయ‌ట‌.

ఆదిత్య రిజ‌ర్వ్ విల్లాస్ సంస్థ గండిపేట‌లో ఈ ల‌గ్జ‌రీ విల్లా ప్రాజెక్టును మొద‌లుపెడుతున్న‌ట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్ప‌టికే రూ.40-60 కోట్ల మ‌ధ్య రేటుతో విల్లాలు అమ్ముతోంది. ఈ సంస్థ ఇంత‌కుముందు ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో 1000 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంతో రూ.50 కోట్ల రేటుతో ల‌గ్జ‌రీ విల్లాల‌ను ప్లాన్ చేసింది. కానీ ఆ ప్రాజెక్టును త‌ర్వాత రాఘ‌వ నోవా పేరుతో ల‌గ్జ‌రీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్‌గా మార్చారు.

కానీ ఇప్పుడు ఒక్కో ఫ్లాట్ అర ఎక‌రం విస్తీర్ణంతో భారీ లగ్జ‌రీ ఫ్లాట్స్‌ను నిర్మించ‌బోతోంద‌ట‌. వీటికి రూ.100 కోట్ల చొప్పున రేటు పెట్ట‌నున్నార‌ట‌. రాఘ‌వ నోవా ప్రాజెక్టును నిర్మించిన మేక‌పాటి వారి స్థ‌లంలోనే ఫేజ్‌-2గా ఈ వంద కోట్ల ల‌గ్జ‌రీ ఫ్లాట్స్‌ను నిర్మించ‌నున్నార‌ట‌.

ఐతే హైద‌రాబాద్‌లో మ‌రీ వంద కోట్ల విల్లా అంటే ఊహ‌కు కూడా అంద‌ని విష‌యం. బ‌డాబాబులైనా స‌రే.. ఇంత రేటు పెట్టి విల్లా కొంటారా అన్న‌ది సందేహం. ఐతే బ‌య్యర్స్ నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టే ఈ ప్రాజెక్టు ముందుకు క‌దులుతుంద‌న్న‌ది స్ప‌ష్టం. మ‌రి రెస్పాన్స్ బాగుండి నిజంగానే వంద కోట్ల విల్లా ప్రాజెక్టు కార్య‌రూపం దాలుస్తుందేమో చూద్దాం.


This post was last modified on February 17, 2026 11:38 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

15 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

23 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago