యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ నేతగా ఆయన ముద్ర వేసుకోవడంతోపాటు.. మంత్రి లోకేష్ ను పూర్తిగా సమర్థించే వారిలో ఒకరుగా నిలిచారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా టీజీ భరత్ పనిచేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుండి తొలిసారి టీడీపీ తరపున గెలుపొందిన ఆయన, చంద్రబాబు దగ్గర మంచి మార్కులు వేయించుకున్నారు.
మంత్రిగా ఆయన పనితీరుకు చంద్రబాబు సహా మంత్రి లోకేష్‌కూడా మంచి మార్కులు వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పదే పదే చెబుతున్న పెట్టుబడుల ఆకర్షణ విషయంలో భరత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంతో కలిసి విదేశీ పర్యటనలు చేసినా.. వ్యక్తిగతంగా పరిశ్రమలను రాబట్టే ప్రయత్నం చేసినా.. ఆయన పనితీరు బాగుందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఢిల్లీలో జరిగిన ‘ఉద్యోగ సమాగమ్’ సదస్సులో, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (దావోస్) వంటి అంతర్జాతీయ వేదికలపై వ్యాపార అవకాశాలను, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాలను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఉద్యోగ కల్పన, జాబ్ మేళాల విషయంలోనూ మంత్రి భరత్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయన పనితీరు బాగుందని చంద్రబాబు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ పేర్కొన్నారు. ఇక, పారిశ్రామిక అభివృద్ధి విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సుమారు 2,800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అలాగే సెమీకండక్టర్ పరిశ్రమ కోసం 130 ఎకరాలు కేటాయించడం, రిలయన్స్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి పనులపై దృష్టి పెట్టారు. స్థానిక అభివృద్ధిని కూడా భరత్ కీలకంగా భావిస్తున్నారు. సొంత నియోజకవర్గమైన కర్నూలులో రోడ్ల మరమ్మతులు, తాగునీటి పైప్‌లైన్ పనుల వేగవంతం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ కోసం నిధులు కేటాయిస్తూ మున్సిపల్ అధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు.
దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. రాజకీయ వ్యూహాలు కూడా అలానే ఉన్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తూ, విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొడుతున్నారు. లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే.. కర్నూలు రాజకీయాల్లో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో మంత్రి దూకుడు ఇలానే కొనసాగుతుందా? మరింత పుంజుకుంటుందా? అనేది చూడాలి.
This post was last modified on October 1, 2026 3:40 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…