కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉన్న పాత సినిమాలను మళ్లీ థియేటర్లకు వెళ్లి మన వాళ్లు సెలబ్రేట్ చేసే తీరు చూస్తే చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొత్త సినిమా రిలీజవుతున్నట్లు పొద్దు పొద్దున్నే పాత సినిమాల షోలకు వెళ్లి మన కుర్రాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఐతే ఇలా పెద్ద హీరోల హిట్ సినిమాలకు చేశారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. అప్పుడప్పుడూ స్టార్లు లేని, ప్లాప్ సినిమాలను సైతం ఇలాగే సెలబ్రెట్ చేస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా వచ్చిన రీ రిలీజ్‌లు అన్నీ ఒకెత్తయితే.. ఈ నెల 29న జరగబోయే ఓ పాత సినిమా రీ రిలీజ్ మరో ఎత్తు. ఆ సినిమా పేరు చెబితే.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఈవీవీ దర్శకత్వంలో రూపొందిన ఆ లేడీ ఓరియెంటెడ్ మూవీనే.. ఆరుగురు పతివ్రతలు.
ఈ సినిమాలో ఏ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ఉండరు. అందరూ చాలా వరకు కొత్త నటీనటులే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చాలా ఏళ్ల కిందటే కాలం చేశారు. సంచలన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ టైటిల్, ఇందులో చూపించిన సన్నివేశాల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లో మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి. ఆ వివాదాలను దాటుకుని ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఐతే ఈ సినిమాను అందరూ మరిచిపోయాక.. సోషల్ మీడియా జమానాలో మళ్లీ ఇది చర్చనీయాంశం అవడం మొదలైంది.
ముఖ్యంగా ఇందులో ఓ అక్రమ సంబంధానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే మామూలు ఫేమస్ కాదు. అందులోని ఆర్టిస్టులు ఇప్పుడసలు ఇండస్ట్రీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ వాళ్లు ఈ సినిమా మీద సోషల్ మీడియాలో జరిగే చర్చల వల్ల బాగా ఫేమస్ అయిపోయారు.
మీమ్స్‌లో కూడా ఇందులోని సన్నివేశాలు, పాత్రలను వాడుతుంటారు. ఈ పాపులారిటీ చూసే ఆరుగురు పతివ్రతలు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఉన్నారు. అక్టోబరు 29కి డేట్ కన్ఫమ్ చేస్తూ మీమ్స్ ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల ఫొటోలతోనే పోస్టర్ రెడీ చేశారు. మరి సోషల్ మీడియలో ఈ సినిమాను సెలబ్రేట్ చేసే జనాలు.. థియేటర్లకు వచ్చి ఆదరిస్తారా అన్నది ఆసక్తికరం.
This post was last modified on October 3, 2026 11:42 am
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…