Political News

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి ఈ సీటును కేటాయించిన నేప‌థ్యంలో ఆయ‌న ఇక్క‌డ నుంచిపోటీ చేశారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న వ్యూహాలు మారుతున్నాయ‌న్న‌ది మంత్రి చెబుతున్న మాట‌. స‌త్య‌కుమార్‌ను త్వ‌ర‌లోనే బీజేపీ కేంద్ర‌క‌మిటీలోకి తీసుకోవాల‌ని యోచిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయాలు రాష్ట్రం నుంచి జాతీయ‌స్థాయికి చేర‌నున్నాయ‌ని క‌మ‌ల నాథులు చెబుతున్నారు. వాస్త‌వానికి స‌త్య‌కుమార్‌.. గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు కూడా జాతీయ‌స్థాయిలో బీజేపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఇంచార్జ్ క‌మిటీలో ఆయ‌న ఈశాన్య‌, మ‌ధ్య భార‌త రాష్ట్రాల్లో కీల‌క రోల్ పోషించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ యంలో బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా.. ఆయ‌న‌ను రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని కోర‌డంతో ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు.

అయితే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న‌ను బీజేపీ జాతీయ నాయ‌క‌త్వంలోకి తీసుకుంటార‌ని.. దీంతో ధ‌ర్మవరం సీటు ఖాళీ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో మంత్రిగా స‌త్యకుమార్ ఎలాంటి ప‌ట్టు బెట్టుల‌కు ఆస్కారం లేకుండా పార్టీ అధిష్టానం సూచ‌న‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ధ‌ర్మవ‌రం నుంచి పోటీ చేయాల‌ని అనుకునే వారు పెరుగుతున్నారు. గ‌తంలో టీడీపీలో ఉండి.. ప్ర‌స్తుతం బీజేపీలో చేరిన వ‌ర‌దాపురం సూచి(గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ‌)తోపాటు టీడీపీ నాయ‌కుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ప‌రిటాల కుటుంబం నుంచి శ్రీరామ్‌.. ధ‌ర్మవ‌రంలో పాగా వేయాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ కుదిరి ఉంటే గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ఇక్క‌డ పోటీ చేసి ఉండాల్సింది. కానీ, ఛాన్స్ చిక్క‌లేదు. ఇక‌, ఇప్ప‌టికీ ధ‌ర్మ‌వ‌రంపైనే ఆశ‌లు ఉన్నాయి. ఇక‌, మ‌రోనేత‌.. టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న చాగంటి రాజేంద్ర కూడా ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీకి స‌మాయ‌త్తం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీరిలో వ‌ర‌దాపురం సూరి.. బీజేపీ నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. పరిటాల కుటుంబానికి, వ‌ర‌దాపురం సూరికి మ‌ధ్య వివాదాలు ఉన్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందన్న‌ది చూడాలి.

This post was last modified on October 2, 2026 3:23 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

50 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

8 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

10 hours ago