బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు విలన్ రెహమాన్ డెకాయిట్ గా నటించిన అక్షయ్ ఖన్నాకు వచ్చిన మాట వాస్తవం. అంత నెగటివ్ షేడ్స్ ని చాలా కూల్ గా ఆయన పండించిన తీరు అభిమానులను కట్టిపడేసింది. సీక్వెల్ లో లేకపోయినా ఫస్ట్ పార్ట్ ప్రభావం వల్ల పార్ట్ 2లో మళ్ళీ ఆ స్థాయి ప్రతినాయకుడిని దర్శకుడు ఆదిత్య ధార్ చూపించలేకపోయారు. అక్షయ్ ఖన్నా డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
అదే సమయంలో హిందీ దృశ్యం 3లో పోలీస్ ఆఫీసర్ గా అక్షయ్ ఖన్నా నటించాల్సి ఉంది. ఎందుకంటే ఈ సిరీస్ లో ఆ క్యారెక్టర్ చేస్తూ వచ్చింది ఆయనే కనక కంటిన్యుటీ కోసం నిర్మాతలు ఆయన్నే సంప్రదించారు. కానీ పారితోషికం భారీగా అడగటం వల్ల ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేశారని, విభేదాలు కూడా వచ్చాయని ముంబై మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కట్ చేస్తే అక్షయ్ ఖన్నా స్థానంలో పాతాల్ లోక్ ఫేమ్ జైదీప్ ఆహ్లావత్ ని తీసుకుని దృశ్యం 3 పూర్తి చేశారు.
ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ చూస్తుంటే అక్షయ్ ఖన్నా వదులుకోవడం వల్ల అజయ్ దేవగన్ బృందానికి ఎలాంటి నష్టం కలగలేదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే క్రైమ్ బ్రాంచ్ ఎస్పిగా జైదీప్ ఆహ్లావత్ దీనికి మంచి ఛాయస్ అనిపించుకున్నాడు. హీరో కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్, డైలాగులు తనకే ఉన్నాయనిపిస్తే అతిశయోక్తి కాదు. పెళ్లి సంబంధం చెడగొట్టే ఎపిసోడ్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో తన ప్రెజెన్స్, యాక్టింగ్ రెండూ బాగా వర్కౌట్ అయ్యాయి.
సో ఆర్టిస్టు పరంగా ఏదైనా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందేమోనని టెన్షన్ పడిన దృశ్యం 3 బృందం ఇప్పడు రిలాక్స్ అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. మొదటిరోజు ఎనభై కోట్లకు పైగా వచ్చి ఉంటుందని ట్రేడ్ టాక్. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో వరసగా మూడు రోజులు మిడ్ నైట్ షోలు వేయడం బట్టి చూస్తే ప్రేక్షకులు ఎంత కనెక్టయ్యారో అర్థం చేసుకోవచ్చు. మలయాళం వెర్షన్ తో అసలు పోలికే లేకుండా దృశ్యం 3లో చేసుకున్న మార్పులు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయి.
This post was last modified on October 3, 2026 10:52 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…