నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఈ ల్యాబ్‌లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడి కంప్యూటర్లలోనే భద్రపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికమైన స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగడం, భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నేటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్ లు, ఆధారాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని తాను అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దానిని కప్పిబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి ఉంది.
This post was last modified on February 7, 2026 2:07 pm
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…