మైదానంలో భారత్‌పై గెలవడం చేతకాక, పాకిస్థాన్ ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విడుదల చేసిన తాజా ప్రోమో ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆస్ట్రేలియా పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు చూపిస్తూనే, భారత్‌ను కించపరిచేలా డైలాగులు పెట్టడం పాక్ క్రీడా విలువల పతనాన్ని సూచిస్తోంది.
ఈ ప్రోమో చివరిలో ఒక పర్యాటకుడు క్యాబ్ డ్రైవర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే.. “షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయారా? బహుశా మీరు మా పొరుగు దేశంలో బస చేసినట్టున్నారు” అని డ్రైవర్ చెప్పే డైలాగ్ ఉంది. భారత్ అనుసరిస్తున్న ‘నో హ్యాండ్‌షేక్’ పాలసీని ఎగతాళి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది. ఇలాంటి చౌకబారు కవ్వింపు చర్యలకు దిగడం పాక్ బోర్డు దిగజారుడుతనానికి నిదర్శనం అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఏ క్రికెట్ బోర్డ్ కూడా ఈ విధంగా చేయలేదు.
భారత జట్టు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గతేడాది పహల్గామ్ దాడుల్లో అమరులైన భారత సైనికులకు సంఘీభావంగా, ఆ దేశ ఉగ్రవాద చర్యలకు నిరసనగా టీమిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, మహిళా క్రికెట్ జట్టు అండర్ 19 జట్లు కూడా దీనినే కొనసాగిస్తున్నాయి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని భారత్ చాటిచెప్పింది.
పాకిస్థాన్ జట్టు ఇటీవల భారత్‌తో జరిగిన దాదాపు అన్ని ప్రధాన టోర్నమెంట్లలో ఘోరంగా ఓడిపోయింది. మైదానంలో టీమిండియా సత్తా ముందు తలవంచిన పాక్, ఇప్పుడు ఇలాంటి ప్రోమోలతో మానసిక యుద్ధం చేయాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మళ్ళీ ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఆట ద్వారా సమాధానం చెప్పడం మానేసి, ఇలాంటి వివాదాస్పద ప్రకటనలతో కాలక్షేపం చేయడం పాక్ క్రికెట్ పతనానికి దారితీస్తోందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
భారత్ తన పట్టువిడవకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం పట్ల కఠినంగా ఉండటాన్ని యావత్ దేశం గర్విస్తోంది. పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా, మైదానంలో టీమిండియా ఇచ్చే సమాధానమే అసలైన విజయం. ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా భారత్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
This post was last modified on January 22, 2026 9:46 pm
ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ సీఎం కాలేరు.. వైసీపీ అధికారంలోకి రాదు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గెలిచి చెప్పారు..…
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. "కంటెంట్ ఉంటే కింగ్, లేదంటే ఆడియన్స్‌కి దొరికేస్తారు". ఒకప్పుడు కేవలం…
ఒకప్పుడు తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించడం కోసం ఏకంగా క్రీడాకారులను స్టేడియం నుంచి బయటకు పంపించిన ఐఏఎస్ అధికారి…
నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 238 పరుగులు బాదినా, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్…
ఇటీవల వచ్చిన 'ది రాజా సాబ్', గత ఏడాది చివర్లో వచ్చిన 'అఖండ 2'.. రెండు సినిమాలు కూడా పక్కా…
రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో…