ఒకేసారి రెండు శతృదేశాలతో యుద్ధానికి రెడీ

ఒకేసారి ఇటు పాకిస్ధాన్ అటు చైనాతో యుద్ధం చేయటానికి భారత్ సైన్యం రెడీ అయిపోతోంది. ఎందుకన్నా మంచిదన్న ఉద్దేశ్యంతోనే ముందుజాగ్రత్తగా 15 రోజులకు సరిపడా మందుగుండు సామగ్రిని, ఆయుధాలు తదితరాలన్నింటినీ రెడీ చేసుకోమని కేంద్రప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం మన దగ్గర 10 రోజులకు మాత్రమే సరిపడా నిల్వలున్నాయి. అదికూడా ఒక దేశంతో యుద్ధం వస్తేనే నిల్వలు సరిపోతుంది. కానీ కేంద్రం నుండి హఠాత్తుగా వచ్చిన ఆదేశాల కారణంగా త్రివిధ దళాల చీఫులు వెంటనే రంగంలోకి దిగేశారు.

నిల్వల విషయంలో కేంద్రం ఆదేశాలివ్వటంతోనే సరిపెట్టకుండా రూ. 50 వేల కోట్లతో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తదితరాల కోనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో ఈ మొత్తం రూ. 300 కోట్లుగా ఉండేదన్న విషయం తెలిసిందే. పాకిస్ధాన్, చైనా సరిహద్దుల్లో ప్రతిరోజు జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. అంటే ఏ రోజు ఏ సమయంలో పై రెండు దేశాలు మనమీదకు దాడులు చేస్తాయో తెలీకుండా ఉంది. అందుకనే మనం కూడా ముందుజాగ్రత్తగానే ఆయుధాలను సమీకరించుకోవాలని కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిసింది.

ప్రస్తుతం ఒకదేశంతో యుద్ధం చేయటానికి 10 రోజులకు సరిపడా ఆయుధాలున్నాయి. అయితే ఒకేసారి రెండు దేశాలతోను యుద్ధం చేయటానికి సరిపడా నిల్వలను రెడీ చేసుకోమని కేంద్రం చెప్పటంలో అర్ధమేంటి ? ఏమిటంటే ఒకదేశం యుద్ధానికి తెగబపడిందంటే దానికి మద్దుగా రెండో దేశం కూడా రంగంలోకి దిగిపోతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అప్పుడు రెండువైపుల నుండి మన సైన్యం యుద్ధం చేయాల్సుంటుంది. అంటే రెండు దేశాలతోను ఏకకాలంలో యుద్ధం తప్పదు. అందుకనే రెండు దేశాలతో యుద్ధం చేయటానికి 15 రోజులకు సరిపడా నిల్వలను రెడీ చేసుకోమని చెప్పింది.

ఇప్పటికే ఒకవైపు పాకిస్ధాన్ మరోవైపు డ్రాగన్ సరిహద్దులో మనసైన్యం భారీ ఎత్తున మోహరించాయి. సైన్యంతో పాటు యుద్ధ ట్యాంకులు, క్షిపణలు, యుద్ధ విమానాలు, మోర్టార్లను పెద్ద ఎత్తున రెడీ చేసేసింది. పాంగ్యాంగ్, లడ్డాఖ్, గాల్వాన్ తో పాటు ఫింగర్ పాస్, సియాచిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో కూడా సమస్త ఏర్పాట్లును చేసుకుంది మన సైన్యం. తాజాగా కేంద్రం ఇంతటి కీలకమైన ఆదేశాలిచ్చిందంటే తెరవెనుక ఏదో జరుగుతున్నట్లే అనుమానంగా ఉంది.