Trends

వీసా రెన్యూవల్… మనోళ్లకు మరో బిగ్ షాక్!

అమెరికాలో ఉద్యోగం చేస్తూ, వీసా రెన్యూవల్ కోసం ఇండియా వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలింది. డిసెంబర్ 15 తర్వాత జరగాల్సిన వేలాది హెచ్ 1బి వీసా ఇంటర్వ్యూలను అమెరికా అధికారులు ఉన్నపళంగా రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది భారతీయ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా తనిఖీలు, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేయడమే అని తెలుస్తోంది.

ఇప్పుడు రద్దయిన ఇంటర్వ్యూలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. కొంతమందికి ఏకంగా 2026 అక్టోబర్ వరకు వాయిదా వేసినట్లు సమాచారం. పాత తేదీల ప్రకారం ఎవరూ కాన్సులేట్ ఆఫీసులకు రావొద్దని, ఒకవేళ వస్తే లోపలికి అనుమతించబోమని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలను మెయిల్ ద్వారా పంపిస్తామని, అప్పుడే రావాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది.

ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఇప్పటికే ఇంటర్వ్యూల కోసం ఇండియాకు చేరుకున్న వారే. పని పూర్తయ్యాక తిరిగి వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసుకున్న వారు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయారు. చేతిలో వాలిడ్ వీసా లేకపోవడంతో వారు తిరిగి అమెరికా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటు ఉద్యోగాలు ఏమవుతాయో తెలియక, ఇటు వీసా ఎప్పుడు వస్తుందో తెలియక వీరంతా తీవ్ర సందిగ్ధంలో పడ్డారు.

దీనిపై ఇమ్మిగ్రేషన్ లాయర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీసా ప్రక్రియ అనేది ఒక అంతులేని గందరగోళంలా మారిపోయిందని ఎమిలీ న్యూమాన్ అనే లాయర్ విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేయడం వల్లే ఇలా జరుగుతోంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని, అందుకే ఇంత ఆలస్యం అవుతోందని సమాచారం.

అమెరికా జారీ చేసే హెచ్ 1బి వీసాల్లో దాదాపు 71 శాతం భారతీయులే ఉంటారు. కాబట్టి ఈ ప్రభావం మనవాళ్ళ మీదే ఎక్కువగా పడనుంది. దీనికి తోడు వీసా ఫీజు పెంపు నిర్ణయాలు కూడా టెక్కీలను కలవరపెడుతున్నాయి. టెక్ కంపెనీలు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ వీసాలను వాడతాయి. కానీ తాజా నిబంధనలతో ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది.

This post was last modified on December 21, 2025 12:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: H1B visa

Recent Posts

వీటి సంగతేంటి: కేసీఆర్ మరిచిపోయారా? కావాలనే వదిలేశారా?

బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.…

34 minutes ago

పేరు మారింది.. పంతం నెగ్గింది!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు.…

1 hour ago

30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కొయిరాలా కలిసి…

బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో…

2 hours ago

లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరదేమో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…

3 hours ago

టీమ్ లో గిల్ లేకపోవడం మంచిదే

నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్‌మన్…

4 hours ago

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర…

6 hours ago