Trends

‘అమెరికా’ జాబ్..యువతి చీటింగ్!

అమెరికాలో ఐటీ ఉద్యోగం అనేది చాలామందికి ఒక కల. కానీ ఆ కలను సాకారం చేసుకోవడానికి కొందరు ఎంచుకుంటున్న అడ్డదారులు ఇప్పుడు నిజాయితీగా చదివేవారి పాలిట శాపంగా మారుతున్నాయి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక తెలుగు యువతి కారులో కూర్చుని జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుండగా, పక్కన ఉన్న ఫోన్లో ఎవరో ఆన్సర్లు పంపిస్తుంటే చూసి చదవడం అందులో క్లియర్‌గా కనిపిస్తోంది.

ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ ‘లిప్ సింక్’ లేదా ‘ప్రాక్సీ’ ఇంటర్వ్యూలు అనేవి ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఇది చాలామంది చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవ్వడం ఇదే తొలిసారి. H 1B వీసా ఉన్న అభ్యర్థులే ఇలాంటి పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో, అమెరికాలోని కంపెనీలు భారతీయ టెక్కీలపై అనుమానపు చూపులు చూస్తున్నాయి. ఇలాంటి చీటింగ్ వల్ల స్కిల్ ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

H-1B వీసా అనేది హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించినది. కానీ కొంతమంది ఇలాంటి ఫ్రాడ్స్ చేసి ఆ సిస్టమ్‌నే దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం వల్ల ట్రంప్ లాంటి పాలకులు వీసా నిబంధనలను మరింత కఠినం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీసాల జారీలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనలు వారికి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుంది.

నిజానికి ఇంటర్వ్యూ పాస్ అవ్వడం ఒకెత్తు అయితే, జాబ్ వచ్చాక సర్వైవ్ అవ్వడం ఇంకో ఎత్తు. ప్రాక్సీ ద్వారా జాబ్ కొట్టినా, అక్కడ పని చేయలేక చాలామంది దొరికిపోతుంటారు. అప్పుడు కేవలం ఉద్యోగం పోవడమే కాదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టి దేశం నుంచి కూడా గెంటేస్తారు. కెరీర్ మొత్తం నాశనం అవుతుంది.

ఈ వీడియోను ఎవరు తీశారు, ఎందుకు బయటపెట్టారు అనేది పక్కన పెడితే.. ఇది మన సిస్టమ్‌లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టింది. షార్ట్ కట్స్‌లో సక్సెస్ వెతకడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తోంది. నిజాయితీగా కష్టపడితే వచ్చేది ఆలస్యం అవ్వొచ్చేమో కానీ, ఇలాంటి అవమానాలు మాత్రం ఎదురుకావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on December 1, 2025 11:49 am

Share

Recent Posts

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

6 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago