పిల్లలకు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాలి. వారికి చదువు నేర్పుతూ భవిష్యత్తుకు బాటలు వేయాలి. అటువంటి టీచర్లు తమ విద్యార్ధిని చెట్టుకు వేలాడదీశారు. హోమ్ వర్క్ చేయలేదంటూ దారుణానికి ఒడిగట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సూరజ్‌పూర్ జిల్లా నారాయణపూర్‌లోని హంసవాణి విద్యామందిర్‌లో ఈ దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల వయసున్న బాలుడిని చెట్టుకు టీచర్లు వేలాడదీశారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారిని చెట్టుకు వేలాడదీసిన దృశ్యాలను స్కూలు పక్కనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని రేపటంతో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వారు అక్కడికి చేరుకున్నారు. వికాస్ ఖండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి.సి. లాక్డా మాట్లాడుతూ, తాను ఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టానన్నారు.
సాయంత్రం జిల్లా కలెక్టర్‌కి నివేదిక సమర్పిస్తాను. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. వీడియో ఆధారంగా.. విద్యార్థిని చిత్రహింసలు పెట్టిన టీచర్లను కాజల్ సాహు, అనురాధ దేవాంగన్గా గుర్తించి వారిపై వేటు వేశారు. పాఠశాల యాజమాన్యం తన తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates