అవును.. ఒక లారీ డ్రైవర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నమ్మకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం అతడి చర్యతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి. తాను కోరుకున్న కోరికను తీర్చేందుకు మొక్కు కోసం ఏకంగా 151 మేకల్ని బలి ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
ధర్మపురి జిల్లాలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ ఒక లారీ డ్రైవర్. అతడికి భార్య హంస.. ఒక కొడుకు ఉన్నాడు. ఆరేళ్ల క్రితం తంగరాజ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా.. ఎందరు వైద్యులకు చూపించినా అతడి అనారోగ్యం మాత్రం తగ్గలేదు. మామూలు మనిషి కాలేదు. దీంతో మరింత కుంగుబాటుకు గురయ్యాడు.
ఇలాంటి వేళ.. పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కు తీసుకుంటే.. తప్పకుండా అనుకున్న పని పూర్తి అవుతుందని చెప్పిన మాటల్ని నమ్మాడు. అందుకు తగ్గట్లే..ఆ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఆరోగ్యం గురించి మొక్కుకున్నాడు. తన అనారోగ్యం కుదుట పడి.. మళ్లీ మామూలుగా అయితే 151 మేకల్ని బలి ఇస్తానని మొక్కుకున్నాడు.
అమ్మవారి మొక్కు తర్వాత.. కొద్ది రోజులకే అతడి ఆరోగ్యం కుదుటపడింది. మామూలు మనిషి అయ్యాడు. దీంతో.. అమ్మవారికి ఇచ్చిన మాటకు తగ్గట్లే తాజాగా రూ.10 లక్షలు ఖర్చుచేసి 151 మేకల్ని కొనుగోలు చేశాడు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి.. అమ్మవారికి బలి ఇచ్చాడు. గుడికి వచ్చిన భక్తులకు మాంసాహారంతో విందు ఇచ్చాడు. ఇంత భారీ ఎత్తున మేకల్ని బలి ఇచ్చిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. లారీ డ్రైవర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
This post was last modified on September 17, 2025 12:50 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…