ఆసియా కప్ ఈసారి పెద్దగా సౌండ్ లేకుండానే మొదలైంది. అందులోనూ భారత్ – పాక్ పోరు ఉంటే ఒక హై వోల్టేజ్ వైబ్ ఉండేది. కానీ ఈసారి అలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 14న జరగబోయే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌పై కూడా పెద్దగా సౌండ్ లేదు. ఇప్పటివరకు భారత్ – పాక్ ఆసియా కప్‌లో 19 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 10 విజయాలు సాధించగా, పాక్ 6 విజయాలు నమోదు చేసుకుంది.
మరో మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ఇవన్నీ గ్రూప్ స్టేజ్, సూపర్ 4 లేదా సెమీ ఫైనల్స్‌లోనే జరిగాయి. కానీ ఒక్కసారి కూడా ఫైనల్‌లో ఈ రెండు జట్లు ఢీకొనలేదు. అంటే ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ – పాక్ పోరాటం ఇప్పటివరకు జరగలేదని గణాంకాలు చెబుతున్నాయి.
భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఆసియా కప్ కిరీటాన్ని గెలుచుకుంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు టైటిల్ గెలుచుకుని భారత్‌కు దగ్గరగా ఉంది.
ఆసియా కప్ చరిత్రలో తొలి ఎడిషన్ 1984లో జరిగింది. అప్పట్లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మాత్రమే బరిలోకి దిగాయి. అప్పుడు ఫైనల్‌లో భారత్ – శ్రీలంక తలపడ్డాయి. ఆ తరువాత ఎన్నో మార్పులు వచ్చినా, ఇరుదేశాలు ఫైనల్‌లో ఒక్కసారైనా కలిసిపోలేదు. 1991లో పాక్ ఆడకపోవడం, 1986లో భారత్ టోర్నీ బహిష్కరించడం లాంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈసారి సెప్టెంబర్ 14న గ్రూప్ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడతాయి. మ్యాజిక్ జరిగితే, సూపర్ 4లోనూ, ఫైనల్‌లోనూ తలపడే అవకాశం ఉంటుంది. అలా జరిగితే చరిత్రలో తొలిసారి భారత్ – పాక్ ఆసియా కప్ ఫైనల్ అభిమానులకు మంచి కిక్కివ్వడం కాయం.
This post was last modified on September 12, 2025 12:33 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…