ఆసియా కప్ 2025లో భారత్ దుమ్మురేపే విజయంతో ప్రారంభించింది. దుబాయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. మొత్తం మ్యాచ్ రెండు గంటలకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలగా, భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
యూఏఈ ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో కొంత మెరుగ్గా ఆడినట్లు కనిపించినా, ఆరంభం తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అలీషాన్ షరాఫు బౌండరీలు కొట్టినా, బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ అతనిని పెవిలియన్ పంపింది. తర్వాత కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పిన్ తాళలేక ఒక్క ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత శివం దూబే అదనంగా చెలరేగి మూడు వికెట్లు తీసి యూఏఈని 13 ఓవర్లలోనే చిత్తు చేశాడు. చివరకు కుల్దీప్ 4/7, దూబే 3/4తో దెబ్బకొట్టారు.
భారత్ బౌలర్ల ఆధిపత్యం తర్వాత బ్యాట్స్‌మెన్లు మాత్రం రన్ చేజ్‌ను జెట్ స్పీడ్ లో మార్చేశారు. తొలి బంతికే అభిషేక్ శర్మ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. గిల్ కూడా నాలుగులు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లే దాటకుండానే లక్ష్యం పూర్తి అయింది. అభిషేక్ 30 పరుగులు, గిల్ 20 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ ఒక్క బంతికే సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు.
మొత్తం మ్యాచ్‌లో యూఏఈ ప్రదర్శనలో పవర్‌ప్లేలో 41/2 పరుగులు మాత్రమే మెరుగ్గా కనబడ్డాయి. కానీ తర్వాత 16/8 స్కోరు నమోదు చేయడం వాళ్లకు ఘోర పరాభవాన్ని తెచ్చింది. ఇది ఆసియా కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుగా నమోదు కావడం యూఏఈకి చేదు రికార్డుగా మిగిలింది. ఇక ఈ గెలుపుతో భారత్ టైటిల్ డిఫెన్స్‌ను బలంగా ప్రారంభించింది. ఆదివారం జరగబోయే భారత్ -పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఈ విజయం మోరాల్ బూస్టర్‌గా మారింది. మరోవైపు యూఏఈకి తమ తర్వాతి మ్యాచ్‌లో ఒమాన్‌తో ఆడే అవకాశం మాత్రమే వాస్తవిక గెలుపు అవకాశమని నిపుణులు చెబుతున్నారు.
స్కోర్లు:
యూఏఈ – 57/10 (13.1 ఓవర్లు)
భారత్ – 60/1 (4.3 ఓవర్లు).
This post was last modified on September 11, 2025 6:43 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…