భారత క్రికెట్‌లో స్పిన్ మాస్టర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు మరో ప్రయాణం వైపు చూడబోతున్నాడన్న చర్చ మొదలైంది. ఐపీఎల్‌కి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల్లోనే అతను విదేశీ లీగ్ వైపు అడుగులు వేస్తాడన్న వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి టార్గెట్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL) అని టాక్ వస్తోంది.
38 ఏళ్ల వయసులో కూడా క్రికెట్‌పై ఉన్న ప్యాషన్ అశ్విన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. టెస్ట్‌లలో అద్భుత ప్రదర్శనలతో పాటు, ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున తన మ్యాజిక్ చూపించాడు. ఇప్పటికీ కొత్త ట్రిక్స్‌తో ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే అతని బౌలింగ్ ఈ లీగ్‌కు కొత్త క్రేజ్ తెచ్చిపెట్టనుంది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఇప్పటికే అశ్విన్‌తో చర్చలు జరుపుతోందన్న వార్తలు వస్తున్నాయి. అశ్విన్ లాంటి ఆటగాడు బీబీఎల్‌లో ఉంటే లీగ్‌కి కొత్త స్థాయి వస్తుంది అని సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే జట్ల బడ్జెట్ దాదాపు ఖర్చయిపోవడంతో ప్రత్యేక కాంట్రాక్టులు, స్పాన్సర్ ఆధారిత డీల్స్ ద్వారా అతడిని తీసుకురావాలనే ప్లాన్ చేస్తున్నారు.
అశ్విన్‌కి ఇది కేవలం ఆట మాత్రమే కాదు. భవిష్యత్‌లో కోచ్‌గా, క్రికెట్ అనాలిస్ట్‌గా, మీడియా రోల్స్‌లో కూడా కొత్త ప్రయాణం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు. తన విశ్లేషణల ద్వారా ఇప్పటికే అభిమానులతో కనెక్ట్ అవుతున్న అతను బీబీఎల్‌లో ఆడటం ద్వారా మరింత అనుభవం సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నాడు.
ప్రస్తుతం మెల్బోర్న్ స్టార్స్, రెనిగేడ్స్ జట్లు అశ్విన్ కోసం ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే బీబీఎల్‌కి ఇండియన్ మార్కెట్‌లో అపారమైన హైప్ వస్తుంది. అశ్విన్ అడుగు ఇతర భారత ఆటగాళ్లకూ మార్గం చూపే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ లెజెండరీ స్పిన్నర్ నిర్ణయం కేవలం వ్యక్తిగత ప్రయాణమే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.
This post was last modified on September 3, 2025 3:27 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…