అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఎప్పటికప్పుడు ఊహించని వార్తలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీసెంట్ గా #TrumpIsDead అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో ఆయన ఆరోగ్యంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాషింగ్టన్ డీసీలో గత వారం వైట్ హౌస్ షెడ్యూల్ ఖాళీగా ప్రకటించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి, తాను ఎప్పుడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నానని వ్యాఖ్యానిస్తూ అన్ని వదంతులను కొట్టిపారేశారు.
ట్రంప్ ట్రూత్ సోషిల్ మీడియాలో స్పందిస్తూ “నేను జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత బాగోలేదు” అని రాసి చల్లటి కబురు చెప్పారు. దీంతో ఆయనపై వస్తున్న ఆరోగ్య వదంతులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అంతేకాకుండా వాషింగ్టన్ ఇప్పుడు ‘క్రైమ్ ఫ్రీ జోన్’ అయిందని కూడా తన స్టైల్లో వ్యాఖ్యానించారు. తనను 24 గంటలు చూడకపోతేనే మీడియా గందరగోళానికి గురయ్యిందని, అయితే బైడెన్ లాంటి నాయకులు కొన్నిరోజులు కన్పించకపోయినా “షార్ప్‌గా ఉన్నారు” అని చెప్పడం డబుల్ స్టాండర్డ్ అని వ్యాఖ్యించిన రాజకీయ వ్యాఖ్యాత్త రోగన్ వ్యాఖ్యలను సమర్థించారు.
ఈ రూమర్స్ మధ్యే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వ్యాఖ్యానించారు. ట్రంప్ చాలా ఫిట్‌గా, ఉత్సాహంగా ఉన్నారని, కాని “భయంకరమైన విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు వదంతులకు మరింత ఊతమిచ్చినా, ట్రంప్ బలంగా ఉన్నారని చెప్పడం కూడా ఆ హ్యాష్‌ట్యాగ్ రచ్చను మరింత వైరల్ గా మార్చింది.
మొత్తానికి సోషల్ మీడియాలో ఎంత గాసిప్ రచ్చ జరిగినా, ట్రంప్ తనదైన శైలిలో ప్రతిస్పందిస్తూ వాటిని తేలిగ్గా తీసుకున్నట్లు కన్పిస్తోంది. తన ఫొటోలను షేర్ చేస్తూ, గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలను చూపించి తాను ఆరోగ్యంగానే ఉన్నానని మరోసారి నిరూపించారు. అలాగే ఆఖరికి చావు వార్తలు వచ్చినా వాటికి తన స్టైల్లో సమాధానం చెబుతూ ప్రజలను ఎట్రాక్ట్ చేయడంలో ట్రంప్ సో డిఫరెంట్ అని మరోసారి నిరూపించాడు.
This post was last modified on September 1, 2025 9:16 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…