Trends

రూ.474 కోట్ల బీమా.. దేశంలోనే సంపన్న గణపతి!

ముంబయి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది మరో రికార్డు సృష్టించాయి. మతుంగా ప్రాంతంలోని జీఎస్‌బీ సేవామండల్ వినాయక మహోత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారు. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరుగాంచిన ఈ మండపం, ప్రతిసారి బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించబడుతుంది. అదే కారణంగా భీమా మొత్తం ఏటా పెరుగుతూనే వస్తోంది.

ఈ ఏడాది వినాయకుడికి అలంకరించనున్న బంగారం, వెండి ఆభరణాల విలువను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.67 కోట్ల బీమా కవరేజ్ ఇచ్చారు. గత రెండు సంవత్సరాల్లో ఈ మొత్తం వరుసగా రూ.38 కోట్లు, రూ.43 కోట్లుగా ఉంది. పూజారులు, నిర్వాహకులు, భద్రతా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడం విశేషం.

అగ్నిప్రమాదం, భూకంపం వంటి అనుకోని ప్రమాదాలకు ఎదుర్కొనేందుకు అదనంగా రూ.2 కోట్ల బీమా తీసుకున్నారు. మండపంలో ఉండే ఫర్నీచర్‌, సీసీటీవీలు, కంప్యూటర్లు కూడా ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ కింద రూ.30 కోట్లు కేటాయించారు. అంటే ఏదైనా ప్రమాదంలో భక్తులకు జరిగే నష్టం కూడా భీమా కింద వస్తుంది.

భక్తులకు సౌలభ్యం కల్పించడానికి నిర్వాహకులు క్యూఆర్‌ కోడ్‌, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ మండపంలో ఆధునిక టెక్నాలజీతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.

This post was last modified on August 18, 2025 6:26 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

9 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

55 minutes ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago