వైసీపీ మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి వ్యతిరేక వర్గం నుంచి భారీ సెగ తగిలింది. ఆత్మీయ సమావేశం పేరిట వ్యతిరేక వర్గం భేటీ అయింది. దీనికి ముందు ర్యాలీగా తరలి వచ్చిన వ్యతిరేక వర్గం నేతలు.. ‘డౌన్ డౌన్ విడుదల రజిని’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గత ఐదు సంవత్సరాల్లో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలతో ఆమె అరాచకాలకు పాల్పడ్డారని వ్యతిరేకవర్గం నాయకులు నినాదాలు చేశారు.
ఇదేసమయంలో ‘రజని వద్దు – జగన్ ముద్దు’ అంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిరసన కారులుగా మారిన వ్యతిరేక వర్గం కార్యకర్తలు.. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాజీమంత్రి విడుదల రజిని ఒక రాణిలాగా చిలకలూరిపేట స్థానికురాలి మాదిరిగా అరాచకాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ వారిపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.
ఇలాంటి వారికి సపోర్ట్ చేసిన సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా రజనీ వ్యవహారం ఉందని అన్నారు. ఆమె కారణంగా అనేక కుటుంబాలు అన్యాయంగా రోడ్డున పడ్డాయని తెలిపారు. ఈమెను నియోజకవర్గం వైసీపీ బాధ్యతల నుంచి తప్పించాలని నాయకుడు డిమాండ్ చేశారు.
This post was last modified on August 18, 2025 6:28 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…