రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని వనరులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం లైఫ్ సైసెన్సెస్‌కు హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. టీకాలు.. ఔషధాల తయారీకి భాగ్యనగరం ప్రపంచ దేశాలకు కూడా హబ్ గా మారుతోంద ని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. తాజాగా అమెరికా కు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కంపెనీ ద్వారా రోజుకు లక్ష డోసుల టీకాలు ఉత్పత్తి కానున్నాయి. అదేవిధంగా నిరంతరాయంగా ఔష ధాలను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. గచ్చి బౌలిలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా స్థానికంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధకులు ఇక్కడకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాతో పోటీ పడాలని అనేక మంది ప్రయత్నిస్తున్నార ని.. పరోక్షంగా ఏపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
కానీ, వారు ఒక అడుగు వేసే లోపే.. తాము వంద అడుగులు పరుగు పెడతామని.. హైదరాబాద్‌లో ఉన్న న్ని వనరులు దేశంలో ఎక్కడా లేవని వ్యాఖ్యానించారు. ఒక్క ఫార్మానే కాదు.. విద్యల పరంగా, ఐటీ పరంగా కూడా .. హైదరాబాద్ ముందుంది. జీనో వ్యాలీ హైదరాబాద్‌కు ఒక మణిపూస. మమ్మల్ని దాటి పోవడం.. ఎవరికీ సాధ్యం కాదు. మాతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మంచిదే. పోటీ పడండి. కానీ.. మమ్మల్ని దాటిపోతామని భావించకండి. అని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు దుద్దిళ్ల కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే నెంబర్ 1 ఔషధ కేంద్రంగా హైదరాబాద్ ఎదిగిందన్నారు. కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలను కాపాడింది.. భాగ్యనగరమేనన్నారు. ఇక్కడ నుంచి టీకాలు, వ్యాక్సిన్‌లు ప్రపంచ దేశాలకు వెళ్లాయని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ తన పేరును నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates