అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది. 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే, ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బంది కార్యాలయంలో చేసిన పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దురదృష్టకరమైన సంఘటనను మర్చిపోకుండా కుటుంబాలు ఇంకా బాధతో అలమటిస్తుండగా, కొంతమంది ఉద్యోగులు మ్యూజిక్, డాన్స్‌తో వేడుకల్లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
ఈ వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎయిరిండియాతో భాగస్వామిగా ఉన్న AISATS సంస్థ తీవ్రంగా స్పందించింది. సంస్థ విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ ప్రవర్తనను ఖండిస్తూ, నాలుగు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించింది. మిగతా సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ పార్టీ కార్యక్రమం గురుగ్రామ్‌లోని కార్యాలయంలో చోటుచేసుకున్నది. సీనియర్ ఉద్యోగులు కూడా డీజే పాటలపై స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు బయటకు వచ్చి విపరీతంగా పబ్లిసిటీ పొందాయి. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు ఇంకా తమ సభ్యుల దేహాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా ఆనందోత్సవాలు జరపడం అనేదే నెటిజన్లను ఉద్వేగానికి గురిచేసింది.
సింగపూర్‌కు చెందిన SATS లిమిటెడ్, ఎయిరిండియాతో కలిసి గ్రౌండ్ సర్వీసెస్ కోసం AISATS పేరుతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌లలో సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో ఇలా బాధాకరమైన ఘటన తర్వాత కాస్త బాధను పంచుకోవాల్సిన సమయంలో పార్టీలు నిర్వహించడాన్ని సహించలేనని నెటిజన్లు అంటున్నారు. “ఇదేనా బాధ్యత?” అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఘటనపై స్పందించిన సంస్థ, బాధిత కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
This post was last modified on June 28, 2025 5:33 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…