“హాయ్, ఇది నేను టానర్.. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నేను ఇక మరణించానని..” అంటూ మొదలైన ఓ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను తాకుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టానర్ మార్టిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందే స్వయంగా ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసిన టానర్.. దాన్ని తన భార్య షేరైట్ బుధవారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
టానర్ జీవితంలోని చివరి సంవత్సరాల్లో తాను ఎలా ఉన్నాడో, క్యాన్సర్‌తో పోరాటం ఎలా సాగిందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకునే వాడు. కాల్ సెంటర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన అతను, క్యాన్సర్ సోకిన తర్వాత తాను పొందిన అనుభవాలను వీడియోలుగా మారుస్తూ లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
అతను రికార్డ్ చేసిన వీడియోలో కన్నీటి మాటలు వినిపించాయి. “ఇది భయంకరమైన ప్రయాణమే అయినా, కొత్త సాహసంగా భావిస్తున్నాను. ఆ మరణం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాను. జీవితం నాకు చాలా ఇచ్చింది. చివరినాళ్లలో మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. తన మరణాన్ని ముందు ఊహించి చెప్పే వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ అది కలిచివేసింది.
తన కుమార్తె ఎమీలౌ కోసం చివరిగా ఒక కోరికను టానర్ వ్యక్తం చేశాడు. ఆమె భవిష్య నిధి కోసం ఏర్పాటు చేసిన గోఫండ్‌మీ లింక్‌కి విరాళాలు ఇవ్వాలని కోరాడు. “ఒక మెక్‌చికెన్ ధరతో కూడా సహాయం చేయవచ్చు” అంటూ తన హాస్యాన్ని చివరి వరకు కొనసాగించాడు. టానర్ పోస్ట్ చేసిన చివరి వీడియోపై సోషల్ మీడియాలో వందలాది రెస్పాన్స్‌లు వస్తున్నాయి. అతని ధైర్యం, స్ఫూర్తిదాయక భావోద్వేగం నెటిజన్లను కదిలించింది. “చివరిసారిగా తన కుమార్తెను చూసినందుకు గర్వపడాలి.. నిజంగా గొప్ప వ్యక్తి” అని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.
This post was last modified on June 27, 2025 9:48 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…