Trends

ఇంకో హనీమూన్ మర్డర్.. జస్ట్ మిస్

కొన్ని వారాల కిందట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. స్వయంగా భార్య సోనమ్‌యే తన ప్రియుడి సపోర్ట్ తీసుకుని సుపారీ కిల్లర్లను పెట్టి తన భర్తను చంపించడం కలకలం సృష్టించింది. తాజాగా తెలంగాణలోని గద్వాల జిల్లాలోనూ తేజేశ్వర్ అనే సర్వేయర్‌ను అతడి భార్య ఇదే రీతిలో చంపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో ఇదే తరహాలో మరో కొత్త పెళ్లికొడుకు ప్రమాదంలో పడి.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ ఉదంతం ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. 

ఆ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరగగా.. ఫస్ట్ నైట్ సందర్భంగా భర్త తనను దగ్గరికి తీసుకోబోతే.. తనను ముట్టుకుంటే కత్తితో ముక్కలుగా నరుకుతానని బెదిరించిందట భార్య. ఆ సందర్భంగానే తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పిందట. వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని తాను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె బెదిరించిందట. మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒక రోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో సితార పారిపోయిందని నిషాద్ ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. సితార తనను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని నిషాద్ తెలిపాడు.

సితార తనతో ఉండగా.. ఎక్కడ తనను చంపేస్తుందో అని సరిగా నిద్ర కూడా పోలేదని.. పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతోందని అతను వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం తెలిసిన వాళ్లంతా నిషాద్ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడని.. లేదంటే రాజా రఘువంశీ, తేజేశ్వర్ తరహాలోనే మరో హత్య జరిగేదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు తరచుగా జరుగుతుండడంతో పెళ్లి అంటేనే కుర్రాళ్లు భయపడే పరిస్థితి తలెత్తుతోంది.

This post was last modified on June 26, 2025 3:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

15 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago