Trends

శుభాంశు శుక్లా న్యూ రికార్డ్.. ఫైటర్ పాటతో రోదసిలోకి!

41 ఏళ్ల అనంతరం మరోసారి భారత్ తరఫున వ్యోమగామి రోదసిలోకి పయనించడం గర్వకారణమైన ఘట్టం. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్-9 రాకెట్ ద్వారా రోదసికి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం 12:01కు లాంచ్ అయిన ఈ ప్రయోగంలో శుభాంశు తో పాటు హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు పాల్గొన్నారు.

ఫ్రాన్స్, యూరప్, అమెరికా, భారత అంతరిక్ష సంస్థలు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ మిషన్‌పై ప్రపంచం దృష్టిసారించింది. ఇప్పటికే తొలితర వ్యోమగామిగా రాకేశ్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆయన తర్వాత అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వరకు చేరనున్న తొలి భారతీయుడిగా కూడా ఆయన గుర్తింపు పొందనున్నారు.

మిషన్‌ ప్రారంభానికి ముందు శుభాంశు తనకు అత్యంత ఇష్టమైన హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ సినిమాలోని ‘వందే మాతరం’ పాటను వింటూ భావోద్వేగానికి గురయ్యారు. లాంచ్ అయిన కొద్దిసేపటికే శుభాంశు రాకెట్‌లో నుంచే దేశ ప్రజలతో మాట్లాడారు. “41 ఏళ్ల తర్వాత మనం మళ్లీ రోదసిలోకి వచ్చాం. ఇది కేవలం ప్రయాణం కాదు. భారత మానవ అంతరిక్ష ప్రయోగాలకు బలమైన పునాది కూడా. నా పయనం ఐఎస్ఎస్‌కే కాదు.. భారత్ అంతరిక్ష దిశగా చేసే ప్రయోగాలకు మార్గదర్శకంగా నిలవాలి” అంటూ గర్వంగా చెప్పారు. భూమిని సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో చుట్టేస్తున్నామని వివరించారు.

శుభాంశు ప్రయోగాన్ని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా లఖ్‌నవూ నుంచి వీక్షించారు. తమ కుమారుడు అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది దేవుని దయతోనే సాధ్యమైందని తండ్రి శంభుదయాల్ శుక్లా చెప్పారు. మిషన్ విజయవంతంగా సాగుతుందన్న నమ్మకంతో కుటుంబసభ్యులు స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. చివరికి మే 12న విజయవంతంగా లాంచ్ అయింది. శుక్లా మిషన్ పైలట్‌గా ఉంటారు. కమాండర్‌గా అమెరికా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ బాధ్యతలు చేపట్టారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో మరో గొప్ప అధ్యాయంగా నిలవనుంది.

This post was last modified on June 25, 2025 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

60 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago